ETV Bharat / state

దర్శి తహశీల్దార్​ను సస్పెండ్‌ చేస్తూ.. ప్రకాశం జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు - ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల ఇచ్చిన కేసులో దర్శి ఎమ్మార్వో సస్పెండ్

Darshi Tahsildar suspended
దర్శి తహశీల్దార్‌ వరకుమార్‌ సస్పెన్షన్‌
author img

By

Published : Feb 24, 2022, 10:02 PM IST

Updated : Feb 24, 2022, 10:53 PM IST

21:59 February 24

ప్రకాశం జిల్లా దర్శి తహశీల్దార్‌ వరకుమార్​పై సస్పెన్షన్‌ వేటు

Darshi Tahsildar Suspended: ప్రకాశం జిల్లా దర్శి తహశీల్దార్‌ వరకుమార్​పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈమేరకు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పరం చేసినట్లు తేలడంతో సస్పెండ్​ చేసినట్లు కలెక్టర్​ పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం, అక్రమంగా పాసు పుస్తకాలు జారీ చేశారన్న ఫిర్యాదుల నేపథ్యంలో విచారణకు ఆదేశించారు. మండల పరిధిలోని పొట్లపాడులో 81 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇతరులకు కట్టబెట్టినట్లు తేలిందని కలెక్టర్​ వెల్లడించారు. వరకుమార్​.. గతేడాది కురిచేడు తహశీల్దార్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు.

ఇదీ చదవండి: JEE advanced exam schedule: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష షెడ్యూల్‌ విడుదల

Last Updated : Feb 24, 2022, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.