ETV Bharat / state

పోలీసులను వెంటాడుతున్నా కరోనా వైరస్..!

ప్రజలను కరోనా నుంచి కాపాడేందుకు ముందువరుసలో ఉంటున్న పోలీసులే.. కొవిడ్ బారిన పడుతుండటంతో.. తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. కింద స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారులు సైతం కరోనా కోరల్లో చిక్కుకోవటంతో సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.

police tested corona positive
కరోనా బారిన పడుతున్న పోలీసులు
author img

By

Published : Aug 19, 2020, 9:01 AM IST

కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు విధుల నిర్వర్తిస్తున్న పోలీసులపై కొవిడ్ పంజా విసురుతోంది. తాజాగా ప్రకాశం జిల్లా ముండ్లమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోలీసులకు నిర్వహించిన కరోనా ర్యాపిడ్ పరీక్షల్లో దర్శి డీఎస్పీకి కొవిడ్ పాజిటివ్​గా తేలింది. దర్శి పోలీస్టేషన్​లో మెుదట ఎస్సైకి, కొద్ది రోజులకు రైటర్​కి.. అనంతరం సీఐకి కరోనా మహమ్మారి సోకగా.. వారందరూ కోలుకొని విధుల్లోకి చేరారు. ఇప్పుడు దర్శి సబ్ డివిజన్ అధికారి కార్యాలయంలో పనిచేసే కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారులు సైతం కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది.

ఇటీవల కురిచేడు శానిటైజర్ తాగి 16 మంది మరణించిన కేసు దర్యాప్తు కోసం ఓఎస్డీ చౌడేశ్వరి ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేసు దర్యాప్తు అనంతరం ప్రత్యేక బృందంలో పని చేసిన అధికారులు కరోనా బారిన పడ్డారనీ.. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. పై అధికారులకు కరోనా సోకటంతో.. బృందంలో పనిచేసిన మిగిలిన సిబ్బంది సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: కరోనా పరీక్షలకు వచ్చి స్పృహ తప్పిన మహిళా కండక్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.