ప్రకాశం జిల్లాలో 257 కేసులు నమోదయ్యాయి. గురువారం వచ్చిన ఫలితాల్లో ఈ విషయాన్ని వైద్యాధికారులు తెలియజేశారు. అందులో చీరాలలో 39 మందికి కరోనా పాజిటివ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో చీరాల పట్టణానికి వచ్చే రహదారుల్లో పోలీసుల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఒంగోలు రిమ్స్‌తో సహా ప్రైవేటు వైద్యశాలలు కొవిడ్ బాధితులతో బెడ్లు నిండిపోయాయి.
ప్రస్తుతం కరోనా అనుమానితులకు మాత్రమే చీరాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే వంద పడకలున్న చీరాల ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేస్తే... ఇక్కడ కూడా కొవిడ్ బాధితులకు వైద్యం అందుతుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి :