Contract employees protest: పది నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదంటూ గ్రామీణ మంచినీటి సరఫరాలో పనిచేసే ఒప్పంద ఉద్యోగులు సెల్‌టవర్ ఎక్కారు. ఈ ఘటన ప్రకాశంజిల్లా దొనకొండ మండలంలోని పోలేపల్లి గ్రామంలో జరిగింది.
చందవరం గ్రామం వద్ద ఆర్డబ్ల్యూఎస్(గ్రామీణ మంచినీటి సరఫరా) కు చెందిన రెండు మంచినీటి చెరువులు ఉన్నాయి. చందవరం-2 చెరువు ద్వారా 136 గ్రామాలకు మంచినీటి సరఫరా జరుగుతుంది. ఈ చెరువు ద్వారా దొనకొండ, కొనకలమిట్ల, పొదిలి తదితర మండలాలలోని 136 గ్రామాలకు మంచినీటిని సరఫరా చేయుటకు 47 మంది ఒప్పంద ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి 10నెలల నుంచి జీతాలు రాకపోవడంతో గత 8 రోజులుగా నిరసన తెలియజేస్తున్నారు.
అధికారుల నుంచి ఎటువంటి సమాధానమూ రాకపోవటంతో ఈరోజు వారు మండలంలోని పోలేపల్లి గ్రామంలోని సెల్ టవర్ ఎక్కారు. సమాచారం అందుకున్న పోలీసులు, సంబంధిత అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. సమస్యలను పరిష్కస్తామని అన్నారు. ముందుగా ఆరు నెలల జీతాలను తక్షణమే మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో ఉద్యోగులు శాంతించి సెల్‌టవర్ దిగి వచ్చారు.
ఇదీ చదవండి: BANK EMPLOYEES PROTEST: "విలీనం పేరిట 28 బ్యాంకులను.. 12కు తగ్గించారు"