ETV Bharat / state

అప్పు చెల్లిస్తానని పిలిచి అత్యాచారయత్నం - అప్పు చెల్లిస్తానని పిలిచి అత్యాచారయత్నం

మహిళ నుంచి రూ.35 లక్షలు అప్పుగా తీసుకున్న కానిస్టేబుల్‌.. వాటిని చెల్లిస్తానని పిలిచి తన మిత్రుడిని ఆమెపై అత్యాచారానికి ప్రేరేపించాడు. బాధితురాలు తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేయగా గురువారం కేసు నమోదైంది. నిందితుడు, అతని స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అప్పు చెల్లిస్తానని పిలిచి అత్యాచారయత్నం

author img

By

Published : Jun 12, 2020, 6:25 AM IST

వెంకట రాజేష్‌ అనే కానిస్టేబుల్‌ ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్నాడు. ఒంగోలు దిబ్బలరోడ్డుకు చెందిన ఓ మహిళతో అతనికి పరిచయం ఏర్పడింది. ఆమె నుంచి రూ.35 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు నగ్నచిత్రాలు, వీడియోలు తీశాడు. డబ్బులు చెల్లించమని కోరితే ఆ చిత్రాలు చూపించి బెదిరింపులకు దిగాడు. ఈ నెల 8న అప్పు చెల్లిస్తానని తన స్నేహితుడు విశ్రాంత సైనికోద్యోగి నల్లూరి సుధాకర్‌ ఇంటికి మహిళను పిలిచాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసేందుకు సుధాకర్‌ను రాజేశ్‌ ప్రేరేపించాడు. బాధితురాలు తప్పించుకొని వెళ్లగా సుధాకర్‌, వీరి స్నేహితుడు దొంగా హరి బెదిరింపులకు దిగారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.