వెలిగొండ ప్రాజెక్టు పునర్నిర్మాణం ప్యాకేజీ, పునరావాసం, పనుల పురోగతిపై ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల నీటిపారుదల శాఖ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికపై ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కొవిడ్-19 ప్రభావం వల్ల ప్రాజెక్టు పనుల మిషనరీ, లేబర్ అందుబాటులో లేని కారణంగా పనులు నిలిచిపోయినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రాజెక్టు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు అవసరమైన లేబర్ ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావడానికి అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. నిర్మాణ పనుల చేపట్టిన కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించడానికి బిల్లులు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఇంజినీర్లను ఆదేశించారు. ప్రాజెక్టు మొదటి సొరంగం పనులు రెండవ వైపు నుంచి కూడా మొదలు పెట్టి అక్టోబర్ నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
'వెలిగొండ ప్రాజెక్టు పనులు అక్టోబర్ నాటికి పూర్తి చేయండి'
వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు అక్టోబరు నెలాఖరు నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పునర్నిర్మాణం ప్యాకేజీ, పునరావాసం, పనుల పురోగతిపై పెద్ద దోర్నాల నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్లో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
వెలిగొండ ప్రాజెక్టు పునర్నిర్మాణం ప్యాకేజీ, పునరావాసం, పనుల పురోగతిపై ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల నీటిపారుదల శాఖ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికపై ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కొవిడ్-19 ప్రభావం వల్ల ప్రాజెక్టు పనుల మిషనరీ, లేబర్ అందుబాటులో లేని కారణంగా పనులు నిలిచిపోయినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రాజెక్టు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు అవసరమైన లేబర్ ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావడానికి అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. నిర్మాణ పనుల చేపట్టిన కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించడానికి బిల్లులు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఇంజినీర్లను ఆదేశించారు. ప్రాజెక్టు మొదటి సొరంగం పనులు రెండవ వైపు నుంచి కూడా మొదలు పెట్టి అక్టోబర్ నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: 'జోగాపురంలో పునరావాస కల్పనకు చర్యలు చేపట్టాలి'