ETV Bharat / state

ఎంతో మంది మగవాళ్ల కన్నా.. అక్కాచెల్లెళ్ల చరిత్ర గొప్పది : సీఎం జగన్

author img

By

Published : Apr 12, 2023, 10:58 PM IST

CM Jagan released YSR EBC funds: ప్రకాశం జిల్లా మార్కాపురం లో రెండో విడత వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం క్రింద 4.39 లక్షల మంది మహిళలకు 659 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ విడుదల చేశారు. అక్కా చెల్లెళ్ల కు జగనన్న పాలనలో జరుగుతున్న మంచిని గుర్తించాలన్నారు. చంద్రబాబు మీ ఇంటికి వచ్చి సెల్ఫీ తీసుకున్నా, స్టిక్కర్లు అంటించినా నిలదీయండి అని.. మహిళలకు జగన్ సూచించారు. జగన్ చేసిన మంచి మీరెందుకు చేయలేదని అడగండని సీఎం అన్నారు.

YSR EBC funds
సీఎం జగన్

YSR EBC Nestham Funds: ప్రకాశం జిల్లా మార్కాపురంలో రెండో విడత వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధులను ముఖ్యమంత్రి జగన్ బుధవారం విడుదల చేశారు. మహిళా ఆర్ధిక స్వావలంబన కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఎంతో మంది మగవాళ్ల జీవిత చరిత్ర కన్నా అక్కా చెల్లెళ్ల జీవిత చరిత్ర కూడా గొప్పదన్న జగన్.. వారికి సెల్యూట్ చేస్తున్నానన్నారు.

మార్కాపురంలో వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం నిధుల విడుదల చేసిన సీఎం జగన్

నగదు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. మహిళలకు తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాల పై ప్రసంగించారు.. సగం నిర్మించి వదిలేసిన టిడ్కో ఇళ్ళ ముందు చంద్రబాబు సెల్పీ తీసి ఛాలెంజ్ విసురుతాడని మనం చేసే అభివృద్ధి మీద ఆయనను ప్రశ్నించండి అని మహిళలను ఉద్దేశించి అన్నారు. 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు మీ జగనన్న ఇచ్చాడు... 22 లక్షల ఇళ్లు నిర్మాణం లో ఉన్నాయి.. చంద్రబాబు ప్రభుత్వం లో ఎందుకు ఇవ్వలేదని స్టిక్కర్లు అంటించడానికో, సెల్ఫీ తీసుకోడానికి వస్తే అడగండి అని జగన్ అన్నారు. నాలుగేళ్ల తన పాలన లో వివిధ పథకాలు ద్వారా 2.07 లక్షల కోట్ల రూపాయలు నగదు అక్క చెల్లెమ్మల ఖాతా లో బటన్ నొక్కడం ద్వారా వేసినట్లు జగన్ పేర్కొన్నారు.

2014 నుంచి ఓ ముసలాయన ముఖ్యమంత్రి ఉండేవాడు... అప్పుడు దండుకో, దంచుకో, తినిపో అంటూ పాలన చేశాడు.. ఆప్పుడు ఇలా మీ ఖాతాలకు డబ్బులు వేశారా? అని జగన్ ప్రశ్నించాడు. జిల్లా అంశాలు మాట్లాడుతూ తన తండ్రి హయాం లో ప్రారంభమైన వెలుగోడు ప్రాజెక్టు పనులు చంద్రబాబు సమయంలో పురోగతి సాధించలేదని, తన హయాంలో మొదటి సొరంగ మార్గం పనులు పూర్తి చేశామని, రెండో సొరంగం పనులు కూడా పూర్తి చేసి, అక్టోబర్ లో ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తామని జగన్ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి పర్యటనలో మాజీ మంత్రి , ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రొటోకాల్ అంశం వివాదమైంది.. పోలీసుల తీరుపై బాలినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, అలిగి వెళ్లి పోయారు. ముఖ్యమంత్రి హెలిప్యాడ్ వద్దకు వెళ్లేందుకు వాహనం లో వచ్చిన బాలినేని ని అక్కడ పోలీసులు నిలిపి వేశారు. దీంతో పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను పంపించకపోవడంతో అలిగిన బాలినేని తిరిగి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్, ఎస్పీ.. ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న జగన్ బాలినేని కి ఫోన్ చేసి తిరిగి రమ్మని పిలిచారు. దీంతో దాదాపు ఒంగోలుకు సమీపం వరకు వెళ్లిన బాలినేని, తిరిగి మార్కాపురం వచ్చి, వేదిక మీదకు వచ్చి కూర్చున్నారు. జగన్ తన ప్రసంగం పూర్తి చేసిన తరువాత.. బాలినేనికి తన పక్కకు పిలిచి, నగదు విడుదల కోసం బటన్ నొక్కించారు.

జగన్ ప్రసంగానికి ముందే కొంతమంది మహిళలు ప్రాంగణం నుంచి గోడ దూకి బయటకు వెళ్లి పోయారు.. మరి కొందరు సభ జరుగుతుండగానే భోజనాల వద్దకు పరుగెత్తారు. అక్కడ ఒక్క సారి జనం పెరిగి పోవడంతో తోపులాట జరిగింది. రాయవరానికి చెందిన మరియమ్మ అనే మహిళకు గాయలవ్వడంతో వైద్య సిబ్బంది చికిత్స చేశారు. బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబోయన వేణు గోపాల్, మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి ప్రసంగించారు. జిల్లాలో ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్ పర్సన్​ బుచేపల్లి వెంకాయమ్మ, ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.