ముఖ్యమంత్రి జగన్ నేడు ఒంగోలులో పర్యటించనున్నారు. వైఎస్సార్ సున్నావడ్డీ పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న జగన్ పది గంటలకు ఒంగోలు చేరుకుని పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం వైఎస్సార్ సున్నావడ్డీ మూడో విడత పంపిణీ రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 12 వందల 61 కోట్ల రూపాయలను డ్వాక్రా సంఘాల మహిళల ఖాతాల్లో జమ చేసేలా బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు.
అనంతరం వ్యాపారవేత్త కంది రవిశంకర్ నివాసానికి వెళతారు. వారి కుటుంబంలో.. ఇటీవల వివాహమైన నూతన వధూవరులను జగన్ ఆశీర్వదించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఆందోళన చేసే అవకాశం ఉందన్న అనుమానంతో వైకాపా నాయకుడు సుబ్బారావు గుప్తాను పోలీసలు అదుపులోకి తీసుకున్నారు.
వచ్చే నెల దావోస్‌కు: రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దావోస్‌లో పర్యటించనున్నారు. వచ్చే నెల మే 22 తేదీన దావోస్‌కు వెళ్లనున్న సీఎం జగన్.. వారం రోజుల పాటు పర్యటిస్తారు. అక్కడ జరగబోయే వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్ లో పాల్గొంటారు. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. బలభద్రపురంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రారంభం అనంతరం సీఎం తో పాటు కుమార మంగళం బిర్లా తాడేపల్లి చేరుకున్నారు. ఆయనకు తన నివాసంలో ప్రత్యేక విందు ఇచ్చిన సీఎం జగన్... జ్ఞాపిక అందజేశారు.
ఇదీ చదవండి: Grasim Industry: గ్రాసిమ్ పరిశ్రమలో స్థానికులకు 75 శాతం ఉపాధి: జగన్