గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రు పరిధిలో ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం చిమటావారిపాలెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంత కాలంగా సూర్యనారాయణ(61) చిలకలూరి పేటలో నివాసముంటున్నారు. బుధవారం రాత్రి చరవాణి ఇంట్లోనే పెట్టి.. ద్విచక్రవాహనంపై పసుమర్రు వెళ్లాడు. అక్కడ జాతీయ రహదారి పక్కన గొర్రెల మండి.. సమీపంలో ఉన్న సిమెంటు బల్ల వద్ద కూర్చుని పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులు కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:తెలంగాణ: ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య