ETV Bharat / state

దాడులపై సీఎం జగన్ ఎందుకు మాట్లాడరు?: చంద్రబాబు

వైకాపా కార్యకర్తల దాడుల బాధితులను పరామర్శించేందుకు... తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని రుద్రమాంబపురం గ్రామంలో ఇటీవల మృతి చెందిన తెదేపా కార్యకర్త కుటుంబీకులను చంద్రబాబు పరామర్శించారు. వారికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించారు.

author img

By

Published : Jul 5, 2019, 5:29 PM IST

వైకాపా ప్రభుత్వం శాశ్వతం కాదు : చంద్రబాబు
వైకాపా ప్రభుత్వం శాశ్వతం కాదు : చంద్రబాబు

ప్రకాశం జిల్లా పర్చూరు మండలం రుద్రమాంబపురం తెదేపా అధినేత చంద్రబాబు పర్యటించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న తెదేపా కార్యకర్త పద్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెదేపా తరఫున రూ.5 లక్షలు ఆర్థికసాయం అందించారు. పద్మ పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్‌ ద్వారా చదివిస్తామని హామీ ఇచ్చారు. ఈ మృతికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. దాడిలో పద్మ భర్తకు తీవ్ర గాయాలయ్యాయన్న చంద్రబాబు...ఇలాంటి ఘటనలను నాగరిక సమాజం ఖండించాలని పిలుపునిచ్చారు.

ఇటువంటి ఘటనలు జరుగుతుంటాయని హోంమంత్రి స్వయంగా అంటున్నారని విమర్శించారు. దాడులపై సీఎం జగన్‌ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. తెదేపా కార్యకర్తలను కొట్టి, తిరిగి వారిపైనే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 95 దాడులు జరిగాయన్న చంద్రబాబు స్పష్టం చేశారు. తన రక్షణ అంశంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

ఇదీ చదవండి : కంటేనే అమ్మ అని... అంటే ఎలా...!

Intro:ap_cdp_17_04_students_union_dharna_avb_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
ఇంటిగ్రేటెడ్ వసతి గృహంలో అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. కడప జిల్లా కాజీపేట మండలంలోని ఇంటిగ్రేటెడ్ వసతి గృహంలో పదవ తరగతి చదువుతున్న ప్రశాంత్ అనే విద్యార్థి రాత్రి తేలు కాటుకు గురయ్యారు. కేవలం వసతిగృహ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగిందంటూ విద్యార్థి సంఘాలు కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఇంటిగ్రేటెడ్ వసతి గృహం లో ఉన్న వార్డెన్ తో పాటు మరో ఇద్దరిని సస్పెండ్ చేయాలని, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతి పై చర్యలు తీసుకోవాలని అని కోరారు. విద్యార్థులకు సరైన భద్రత లేదని ఆరోపించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు కలెక్టరేట్ కు రాగా కలెక్టర్ కనీసం ఏం జరిగిందని విచారించకపోవటం దారుణమని ఖండించారు. కలెక్టర్ కు దళితుల పట్ల ఉన్న నిర్లక్ష్యం బహిర్గతం అయింది అన్నారు. వసతిగృహం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
byte: ఓబులేసు, విద్యార్థి సంఘం నాయకులు, కడప.

Body:విద్యార్థి సంఘాలు ఆందోళన

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.