TCS will be set up in Visakhapatnam: అందాల సాగర తీరానికి త్వరలోనే మరో మణిహారం రానుంది. మంత్రి నారా లోకేశ్ చొరవతో విశాఖలో ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ (Tata Consultancy Services) ఏర్పాటు కానుంది. టీసీఎస్ రాకతో యువతకు 10 వేల ఐటీ ఉద్యోగాలు లభించనున్నాయి. మంగళవారం ముంబయిలో టాటా గ్రూప్ ఛైర్మన్‌తో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. ఈవీ, ఎయిరో స్పేస్ రంగాల్లో పెట్టుబడులు పరిశీలిస్తామని టాటా గ్రూప్ తెలిపింది. అదేవిధంగా స్టీల్, టూరిజం రంగాల్లో పెట్టుబడులు పరిశీలిస్తామని సంస్థ ఛైర్మన్ తెలిపారు. టాటా గ్రూప్ ఛైర్మన్‌ను ఒప్పించి విశాఖకు టీసీఎస్ వచ్చేలా మంత్రి లోకేశ్ చేసిన కృషి సఫలమైంది.
లులు, ఒబెరాయ్, బ్రూక్ ఫీల్డ్, సుజలాన్ తర్వాత ఏపీకి టీసీఎస్ రానుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో కంపెనీలను ఆహ్వానిస్తున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామికాభివృద్ధిలో రాష్ట్రం నెంబర్ వన్‌గా నిలిచేందుకు ఇది తొలి అడుగని లోకేశ్ సామాజిక మాద్యమం ఎక్స్(X)లో పోస్ట్ చేశారు. టీసీఎస్ రాకతో విశాఖ ఐటీ హబ్‌గా మారనుందని ప్రఖ్యాత కంపెనీల పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీ మారుతుందని హర్షం వ్యక్తం చేశారు. అత్యుత్తమ పెట్టుబడి వాతావరణం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
I’m happy to announce the development of a IT facility by the Tata Consultancy Services Ltd. in Vizag that will house 10,000 employees. We are committed to offering best-in-class investment climate to corporates driven by our motto of ‘speed of doing business’. This investment by…
— Lokesh Nara (@naralokesh) October 9, 2024
వైజాగ్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ 10 వేల మంది ఉద్యోగులతో కూడిన ఐటీ అభివృద్ధి చేయడాన్ని మంత్రి లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు. వ్యాపారం చేయడంలో వేగం అనే తమ నినాదంతో నడిచే కార్పొరేట్‌లకు అత్యుత్తమ పెట్టుబడి వాతావరణాన్ని అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. రాష్ట్రాన్ని వ్యాపార రంగంలో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా చేయడానికి తాము చేస్తున్న కృషికి టీసీఎస్ ద్వారా ఈ పెట్టుబడి ఒక మైలురాయని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.
50 వేలు దాటిన దరఖాస్తులు - 14న మద్యం షాపులు కేటాయింపు
ప్రశంసలు: లోక్‌శ్‌ను శాప్‌ఛైర్మన్ రవినాయుడు ప్రశంసించారు. లోకేశ్ సారథ్యంలో యువత భవిష్యత్తు బంగారుమయమైందన్నారు. 10వేల ఐటీ ఉద్యోగాలే కల్పనగా టాటా సంస్థ ముందుకు వచ్చిందని తెలిపారు. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా లోకేశ్ ముందుకెళ్తున్నారన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే పలు కంపెనీలు వచ్చాయని తెలిపారు. విజనరీ, ప్రిజనరీ పాలనకున్న వ్యత్యాసం ఇదేనని స్పష్టం చేశారు. లోకేశ్ మరెన్నో మైలురాళ్లు దాటుకుంటూ ముందుకు వెళ్లాలని శాప్ ఛైర్మన్ ఆకాంక్షించారు. మంత్రి లోకేశ్‌ను ఐటీ పార్క్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నరేష్‌కుమార్ అభినందించారు.
డిసెంబరులో అమరావతి పనులు ప్రారంభం - 2027 నాటికి బుల్లెట్ ట్రైన్: సీఎం చంద్రబాబు
"అరకు కాఫీ" అదుర్స్ - రైతుల కష్టాలకు చెక్ పెట్టిన టెకీ నిర్ణయం