ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో హృదయవిదారకర ఘటన చోటు చేసుకుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. రెండ్రోజులుగా ఆస్పత్రి ఆవరణలో మృతదేహాన్ని అలానే వదిలేశారన్న చంద్రబాబు... ఆ మృతదేహాన్ని కుక్కలు పీక్కుని తింటున్నా పట్టించుకున్న వారే లేరని ఆక్షేపించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులు నరకం చూస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.
ఇదీ చదవండీ... మాకు మహానగరాలు లేవు.. మెరుగైనవైద్యం కోసం సహకారం ఇవ్వండి: సీఎం