ప్రకాశం జిల్లా ఒంగోలు రైల్వే వంతెనకు రబ్బర్లు బిగించాలని ఆటో డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. ఒంగోలు కొత్తపట్నం రోడ్డులో వంతెన వద్ద రోడ్డుకి అడ్డంగా ఆటోలు నిలిపి ఆందోళనకు దిగారు. వంతెనపై రబ్బర్లు పూర్తిగా చెడిపోవటంతో తాము సంపాదించే అరకొర డబ్బులు రిపేర్లకే ఖర్చు చేయాల్సి వస్తోందని డ్రైవర్లు వాపోయారు. సమస్యను పరిష్కరించాలని రోడ్డు భవనాల శాఖ అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళనలు చేస్తామని.. పట్టించుకోకపోతే రోడ్డు భవనాల శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి :ఊబిలో పడిన గేదె.. కాపాడిన పోలీసులు