ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలో కాలం చెల్లిన క్రిమిసంహారక మందులు, పశువుల మందులను కొందరు.. కుప్పలు కుప్పలుగా పడేశారు. చుట్టుపక్కల సంచరించే మూగజీవాలు.. ఆహారం దొరక్క.. వాటినే తిని అనారోగ్యం పాలై చివరకు మరణించే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ మందుల నుంచి విపరీతమైన దుర్గంధం వస్తున్న కారణంగా.. పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అధికారులు కనీస చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాలం చెల్లిన మందులను కాల్చడమో... పూడ్చడమో చేయాలే గానీ.. ఇలాంటి బహిరంగ ప్రదేశాల్లో పడవేయడం ఏమిటని.... భవిష్యత్తులో రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: