బహిరంగ మార్కెట్ లో దొరుకుతున్న చైనా వస్తులవులు వాడకూడదని, వాటిని నిషేధించాలని కోరుతూ... ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో పూర్వవిద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈపురుపాలెంలోని జిల్లాపరిషత్ పాఠశాల 1988-89 పదోతరగతి పూర్వవిద్యార్థులు... చైనా తీరుపై నిరసన వ్యక్తం చేసి, వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రపంచదేశాల్లో భారతదేశానికి ప్రత్యేక స్థానం ఉందని పూర్వవిద్యార్థులు సంఘం ప్రతినిధి రవి అన్నారు. చైనా ఉత్పత్తులను నిషేధించాలని కోరారు.
ఇది చదవండి 'మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన ర్యాలీ'