ప్రకాశం జిల్లా మార్టూరు వ్యవసాయ మార్కెట్లో వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు. ముందుగా రైతు భరోసా కేంద్రాన్ని, ల్యాబ్ ను పరిశీలించారు. పర్చూరు నియోజకవర్గంలో 60 వేల రైతు కుటుంబాలున్నాయని.. తూతుమంత్రంగా సమావేశం నిర్వహిస్తే రైతులకు ప్రయోజనం ఉండదన్నారు.
రైతు సమావేశం అంటే వ్యవసాయ శాఖే కాదు.. దానికి అనుబంధంగా ఉన్న శాఖలన్ని ఉండి రైతుల సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేయాలని చెప్పారు. నియోజకవర్గంలో మిర్చి రైతులు ఇబ్బంది పడుతున్నారని, మరల మూడు నెలల్లో కొత్త మిర్చి పంట మార్కెట్కు వస్తుంది.. ప్రభుత్వం వెంటనే పర్చూరు, ఇంకొల్లు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని చెప్పారు. అనంతరం ఆయన రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్టు