ETV Bharat / state

మనసున్న మాస్టారు.. విద్యార్థి కుటుంబాలకు సాయం చేశారు - chirala

ప్రకాశం జిల్లా చీరాల పట్టణం యాదవపాలెం ఎయిడెడ్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీమన్నారాయణ పేద విద్యార్ధుల కుటుంబాలకు రూ.500 చొప్పున సాయం అందించారు.

a-principal-assistance-for-student-families-at-rs-500
మనసున్న మాస్టారు.. విద్యార్థి కుటుంబాలకు రూ.500 చొప్పున సాయం
author img

By

Published : Mar 30, 2020, 4:08 PM IST

చీరాల పట్టణం యాదవపాలెం ఎయిడెడ్‌ ప్రాథమిక పాఠశాలలో 33 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రధానోపాధ్యాయుడిగా రత్నాకరం శ్రీమన్నారాయణ విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన కోడిగుడ్లను కొద్ది రోజులగా పంపిణీ చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా పూట గడవడం కష్టంగా మారిందని... ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి అవస్థలు ప్రత్యక్షంగా చూసిన శ్రీమన్నారాయణ... ఏదో రూపంలో సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.500 చొప్పున అందజేస్తున్నారు. పాఠశాల పరిసరాల్లో అందుబాటులో ఉన్న 16 మందికి ఇలా సాయం అందించారు.

చుట్టు పక్కల గ్రామాలకు చెందిన విద్యార్థులు కూడా చీరాలలోని బీసీ వసతి గృహంలో ఉంటున్నారు. వీరందరిని స్వయంగా కలిసే అవకాశం లేకపోవటంతో..వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయాలని నిర్ణయించారు.

"సెలవుల్లో తీర్థయాత్రలకు వెళ్లే అలవాటు ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సారి వెళ్లలేకపోయాను. ఆ మొత్తాన్ని పేద విద్యార్థుల కుటుంబాలకు ఇస్తే కొంతైనా ఆసరాగా ఉంటుందని ఇలా చేస్తున్నా. లాక్‌డౌన్‌ ఉన్నంత కాలం నా వంతుగా సాయం అందిస్తాన" అని తెలిపారు ప్రధానోపాధ్యాయుడు శ్రీమన్నారాయణ.

ఇది చూడండి:

విధి నిర్వహణలోనూ సమాజ సేవ చేస్తున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.