ETV Bharat / state

లాక్​డౌన్​తో ఆర్థిక ఇబ్బందులు.. ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య - praksam crime news

కరోనా లాక్​డౌన్​తో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఓ టీ దుకాణంలో పనిచేసే వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా చీరాలలోని జవహర్​ నగర్​లో జరిగింది. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లాక్​డౌన్​తో ఆర్థిక ఇబ్బందులు.. ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

author img

By

Published : Aug 21, 2020, 7:21 AM IST

ప్రకాశం జిల్లా చీరాలలోని జవహర్​నగర్​లో దుర్గారావు అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దుర్గారావు పర్చూరులో ఓ టీ దుకాణంలో పని చేసేవాడు. ప్రస్తుతం కరోనా లాక్​డౌన్​ నేపథ్యంలో ఇంటి వద్దే ఉంటున్నాడు. భార్య.. పిల్లలతో కలిసి గుంటూరు జిల్లా భట్టిప్రోలులోని పుట్టింటికి వెళ్లింది.

తన మృతికి ఎవరూ కారణం కాదని.. కేవలం లాక్​డౌన్​ వల్ల ఆర్థిక ఇబ్బందులతోని బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు మృతుడు సూసైడ్​ నోట్​లో పేర్కొన్నాడు. మృతుని బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి..

'కమీషన్ ఇస్తేనే భూ నిర్వాసితులకు పరిహారమా?!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.