YCP Leaders Occupied Lands: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో సర్వేనంబర్ 528లో 17ఎకరాల భూమిని 17మందికి 2003లో అసైన్డ్ పట్టాలు ఇచ్చారు. వారికి ఇచ్చినప్పుడు ఇది బీడు భూమి. వారు బీడు భూములను సాగు చేసి మాగాణులుగా మార్చారు. 20ఏళ్లుగా పెసర, మినుము, వేరుశనగ వంటి పంటలు పండించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో భూమి మంచి ధర పలుకుతోంది. దీంతో పేదలు సాగు చేసుకుంటున్న భూములపై వైసీపీకి చెందిన నాయకులు కన్నుపడింది. అసైన్డ్ పట్టాలో ఉన్న సర్వేనంబర్కు అదనంగా కొత్త నంబర్లు చేర్చి రికార్డులు మార్చేశారు. ఆ భూముల్ని వారసత్వంగా పొందినట్లు పట్టాలు సృష్టించారు. విషయం తెలుసుకున్న రైతులు అధికారుల చుట్టూ తిరుగుతూ తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. తమకు న్యాయం చేయాలని స్పందనలోనూ అర్జీలు ఇచ్చారు.
తమ భూమి కబ్జా జరిగిందంటూ బాధితులు తమకు ఫిర్యాదు చేశారని.. దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. స్పందనలోనూ వినతిపత్రాలు ఇచ్చామని, అధికారులు స్పందించడంలేదని రైతులు వాపోతున్నారు. అక్రమంగా తయారు చేసిన పట్టాలను రద్దు చేసి న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: