ETV Bharat / state

నెల్లూరు మాగుంట లేఅవుట్‌లో మహిళ మృతదేహం - womans dead body

మహిళ మృతదేహం
మహిళ మృతదేహం
author img

By

Published : Aug 20, 2021, 3:25 PM IST

Updated : Aug 20, 2021, 4:27 PM IST

15:20 August 20

Woman's body in Nellore Magunta layout

నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ లో మహిళ మృతదేహం కలకలం సృష్టించింది. ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు ఉండే ప్రధాన ప్రాంతం లో గుర్తుతెలియని మహిళ  మృతదేహాన్ని పోలీసులు గుర్తించడం చర్చనీయాంశంగా మారింది. 

కింగ్ కౌర్ట్స్ వీధిలోని ప్రధాన సైడు కాలువలో మహిళ మృతదేహాన్ని ఈరోజు ఉదయం స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న దర్గామిట్ట పోలీసులు కాలువలో నుంచి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతురాలి శరీరంపై గాయాలు ఏమైనా ఉన్నాయా.. అని పరిశీలించారు. చనిపోయిన మహిళ వయస్సు 40 నుంచి 50 మధ్యలో ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.

ఈ ఘటన జరిగి రెండు రోజులు గడిచి ఉంటుందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి లోని శవగారానికి తరలించారు. 

ఇదీ చదవండి: Crime news: లాడ్జిలో ఆత్మహత్యాయత్నం.. బాలిక పరిస్థితి విషమం

Last Updated : Aug 20, 2021, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.