ETV Bharat / state

పల్లె తీర్పు: ఆ పంచాయతీలో తొలిసారిగా ఎన్నికలు...ఒక్క ఓటుతో గెలుపు - ఏపీ స్థానిక ఎన్నికల ఫలితాలు

ఆ పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి తొలిసారిగా ఎన్నికలు..అప్పటి వరకూ అన్నీ ఏకగ్రీవాలే..! అలాంటి పంచాయతీలో జరిగిన ఎన్నికలో ఫలితం అత్యంత ఆసక్తిని రేపింది. తొలిసారిగా జరిగిన ఈ పోరులో ఒక్క ఓటు తేడాతో ఫలితం తేలింది.

ఏపీ పంచాయతీ ఎన్నికలు
ఒక్క ఓటు తేడాతో గెలుపు
author img

By

Published : Feb 10, 2021, 10:32 AM IST

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం పామూరుపల్లి పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా జరిగింది. నువ్వా-నేనా అన్నట్లు సాగిన లెక్కింపులో తెలగొర్ల సుశీల ఒక్క ఓటుతో విజయం సాధించారు. రెండు దఫాలుగా రీకౌంటింగ్‌ చేసినా ఒక్క ఓటు ఆధిక్యం రావడంతో సుశీల విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఈ పంచాయతీ ఏర్పడిన తర్వాత ఇక్కడ ఎన్నికలు జరగడం ఇదే ప్రథమం. ఇప్పటి వరకు అన్నీ ఏకగ్రీవాలే.

ఇదీ చదవండి: తెదేపా గెలుస్తుందంటావా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.