నెల్లూరు జిల్లా ఉదయగిరి కోటను పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. జిల్లాలో పర్యటకులను ఆకర్షించే ప్రాంతాలు అనేకం ఉన్నాయని తెలిపారు. సీతారామపురంలో గ్రామ సచివాలయ భవనం చక్కగా నిర్మించుకున్నారని స్థానికులను అభినందించారు. అనంతరం గ్రామాల్లో పరిస్ధితులను అడిగి తెలుసుకున్నారు. ఇరిగేషన్ చెరువులు అభివృద్ధి, సాగునీటి అభివృద్ధి పథకాలను పరిశీలించారు.
ఇదీ చదవండి:
శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద.. 10 గేట్లు ఎత్తి నీటి విడుదల