తెలుగుదేశం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ ప్రజలు తనను ఓడించటం పట్ల నైతిక బాధ్యత వహిస్తున్నట్లు వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ..వారికి సేవ చేయటమే తన కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధిలో ప్రస్తుత ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు సహకరిస్తామన్నారు. ప్రజల కష్టాలను తీర్చకపోతే తాము ఉద్యమించడంలో వెనుకాడబోమని రామకృష్ణ హెచ్చరించారు.
ఇవి చదవండి...సాగర తీరంలో ఏటీఎం కార్డుల క్లోనింగ్