నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకా పంపిణీ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలకు వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ చేశారు. మండలంలోని కలిపేడు పంచాయతీ మూర్తిరెడ్డి పాళెం అంగన్వాడీ కార్యకర్త.. దివ్యాంగురాలైన పద్మ.. తన బిడ్డతో కలిసి వచ్చి టీకా తీసుకున్నారు. నాయుడుపేట పెళ్లకూరు ఓజిలి మండలాలకు చెందిన అంగన్వాడీ సిబ్బంది టీకాలు వేయించుకున్నారు. వారిలో ఒకరిద్దకీ ఒళ్లు తిరిగినట్లు అనిపించగా వాళ్లను ఐసీడీఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ఇదీ చూడండి: కొవిడ్ వాక్సిన్‌పై మీ డౌట్స్ ఇవేనా..?