నెల్లూరులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పెన్నానది కొత్త బ్రిడ్జి సమీపంలో దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు తెలియజేయగా విషయం వెలుగుచూసింది. ఎక్కడో హత్యచేసి అనంతరం గుడ్డ చుట్టి మృతదేహాన్ని బ్రిడ్జి వద్ద పడేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. మూడు రోజుల క్రితం హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుని వివరాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: