నెల్లూరు జిల్లా వెంకటగిరిలో విషాదం జరిగింది. పట్టణంలోని కైవల్య నదిలోకి దిగి ఇద్దరు బాలురు మృతి చెందారు. గాలిపటం నదిలో పడటంతో ముగ్గరు చిన్నారులు దానికోసం నదిలోకి దిగారు. ఈత రాకపోవటంతో వారు నీటిలో చిక్కుకున్నారు. చిన్నారులు మునిగిపోతుండగా స్థానికులు గమనించి నీటిలోకి దిగి ఓ బాలుణ్ని రక్షించగలిగారు. మిగతా ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు అభి(7), సురేష్(15)లుగా గుర్తించారు. మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం వెంకటగిరిలోని సామాజిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. తమ బిడ్డల మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఇదీ చదవండి: