LIVE ఆర్గానిక్ కుప్పం- ప్రకృతి సేద్యంపై రైతులతో సీఎం ముఖాముఖి - ప్రత్యక్ష ప్రసారం - CM CBN INTERACTION WITH FARMERS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 6, 2025, 6:11 PM IST

Updated : Jan 6, 2025, 8:53 PM IST

CM CBN INTERACTION WITH FARMERS: రెండు రోజుల పర్యటనలో భాగంగా కుప్పంలో  ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మొదటి రోజు ఉదయం  ఈ మేరకు కుప్పం నియోజకవర్గంలోని ద్రవిడ వర్శిటీ ఆడిటోరియంలో 'స్వర్ణ కుప్పం విజన్- 2029' డాక్యుమెంట్ ఆవిష్కరించారు. జూన్‌లోగా హంద్రీనీవా జలాలు పాలారు వాగు తెచ్చి దానిపై చెక్‌డ్యామ్‌ నిర్మిస్తామని వెల్లడించారు. కుప్పంలో రెండు రోజుల పర్యటన సందర్భంగా ఇవాళ పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రజలను పేదిరికం నుంచి బయటపడేసే పీ4 విధానం అమలుకు కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. హైదరాబాద్​లో ఆనాడు తాను చేసిన అభివృద్ధి ఫలాలు ఇప్పుడు వస్తున్నాయని అన్నారు. తెలంగాణకు హైదరాబాద్‌ నుంచే ఎక్కువ ఆదాయం వస్తుందని తెలిపారు. 2014-19 మధ్య రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించామని, వైఎస్సార్సీపీ హయాంలో 4 శాతం అభివృద్ధి తగ్గిపోయిందని మండిపడ్డారు. రాష్ట్రం అప్పులకుప్పగా మారిందని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో కుప్పంను ఎలా అభివృద్ధి చేస్తామో ప్రణాళిక రచించామని పేర్కొన్నారు. ప్రస్తుతం సీగలపల్లెలో 'ఆర్గానిక్ కుప్పం' కార్యక్రమంలో భాగంగా ప్రకృతి సేద్యం రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం.  
Last Updated : Jan 6, 2025, 8:53 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.