ETV Bharat / state

'8 వారాల తరువాత వస్తా!' - మరోసారి సీఐడీ విచారణకు ఆర్జీవీ డుమ్మా - RGV NOT ATTENDED FOR ENQUIRY

గుంటూరు సీఐడీ అధికారుల ఎదుట విచారణకు ఆర్జీవీ గైర్హాజరు - సినిమా ప్రమోషన్‌లో ఉన్నందున విచారణకు రాలేనన్న రాంగోపాల్‌వర్మ

RGV Not Attended for Enquiry
RGV Not Attended for Enquiry (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 10, 2025, 12:28 PM IST

Updated : Feb 10, 2025, 2:39 PM IST

RGV Not Attended for Enquiry: గుంటూరు సీఐడీ అధికారుల ఎదుట విచారణకు ఆర్జీవీ హాజరు కాలేదు. విచారణకు 8 వారాల సమయం కోరారు. సినిమా ప్రమోషన్‌లో ఉన్నందున విచారణకు రాలేనన్న ఆర్జీవీ, తన తరఫున న్యాయవాదిని సీఐడీ కార్యాలయానికి పంపారు. కాగా రాంగోపాల్‌ వర్మ 2019లో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరుతో సినిమాని తీశారు. ఆ సినిమా పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ హైకోర్టులో కొందరు పిల్‌ వేయడంతో ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అనే పేరుతో రిలీజ్ చేశారు.

అయితే ఈ సినిమాని యూట్యూబ్‌లో మాత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే పేరుతోనే విడుదల చేశారంటూ సీఐడీ పోలీసులకు మంగళగిరి సమీపంలోని ఆత్మకూర్‌కు చెందిన వంశీకృష్ణ బండారు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. అందులో కొన్ని దృశ్యాలను తొలగించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా కులాలను రెచ్చగొట్టే విధంగా ఆర్జీవీ పోస్టులు పెట్టారని పేర్కొన్నారు. ఈ మేరకు రామ్​గోపాల్ వర్మపై మంగళగిరిలోని సీఐడీ పోలీస్‌ స్టేషన్‌లో గతేడాది నవంబరు 29వ తేదీన కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన నోటీసులను 7వ తేదీన సీఐడీ అధికారులు వర్మకు అందజేశారు. నేడు గుంటూరు సీఐడీ కార్యాలయానికి రావాలని సీఐడీ పోలీసులు సూచించారు.

సినిమా ప్రమోషన్‌లో ఉన్నా - 8 వారాల తర్వాత వస్తా: అయితే "కమ్మ రాజ్యంలో కడప రెడ్లు" సినిమా ద్వారా ఒక వర్గం మనోభావాల్ని దెబ్బతీశారని నమోదైన కేసులో ఇవాళ విచారణకు దర్శకుడు రాంగోపాల్ వర్మ హాజరు కాలేదు. తన న్యాయవాదిని పంపించి విచారణకు 8 వారాల సమయం కావాలని అభ్యర్థించారు. 10వ తేదీన గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు రావాలని పేర్కొన్నప్పటికీ, సినిమా ప్రమోషన్​లో ఉన్నందున విచారణకు హాజరు కాలేనంటూ ఆర్జీవీ సీఐడీ అధికారులకు తెలిపారు. 8 వారాల తర్వాత వస్తానన్నారు. వర్మ ఇచ్చిన జవాబుపై సీఐడీ అధికారులు ఇంకా అధికారికంగా స్పందించలేదు. మరోసారి నోటీసు ఇవ్వాలని సీఐడీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

ఆర్జీవీకి 40కి పైగా ప్రశ్నలు - తొమ్మిది గంటల పాటు విచారణ

10న రండి - రామ్‌గోపాల్‌వర్మకు సీఐడీ నోటీసులు

ఆర్జీవీ విచారణ - పోలీసుల తీరుపై విమర్శలు

Last Updated : Feb 10, 2025, 2:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.