ETV Bharat / offbeat

బాలీవుడ్ బ్యూటీ కొత్త రెసిపీ - నెట్టింట వైరల్​గా మారిన 'కొబ్బరి చిప్పల్లో ఇడ్లీ' - COCONUT SHELL IDLI RECIPE

నెట్టింట వైరల్‌గా మారిన 'కోకొనట్‌ షెల్‌ ఇడ్లీ' - మరో రెసిపీతో ముందుకొచ్చిన కరిష్మా

bigboss_actress_karishma_coco_shell_idli_recipe
bigboss_actress_karishma_coco_shell_idli_recipe (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 10, 2025, 12:27 PM IST

Coconut Shell Idli Recipe : మార్నింగ్ టిఫిన్లలోకి ఎక్కువగా చేసుకునే ఇడ్లీపై జరిగిన ప్రయోగాలు ఇంకే వంటకంపైనా జరిగి ఉండకపోవచ్చు. అప్పటికప్పుడు తయారు చేసుకునే ఇడ్లీలు తెల్లగా, స్పంజీగా పల్లీ చట్నీ, సాంబార్​లోకి కమ్మగా ఉంటాయి. అయితే, కుక్కర్​లో చేసుకునే ఇడ్లీలను ఆకుల్లోనూ చుట్టి తయారు చేస్తుంటారు. అరటి ఆకుల్లో, పనస ఆకుల్లో పిండి మిశ్రమాన్ని పోసి ఆవిరిపై ఉడికిస్తారు. వీటిని ప్రాంతాల వారీగా వేర్వేరు పేర్లతో పిలుస్తుంటారు.

అల్యూమినియం పాత్రల్లో వంట ప్రమాదకరమా? - డాక్టర్లు ఏం చెప్తున్నారంటే!

గృహశోభను పెంచే ఈ ఎండు కొబ్బరి చిప్పల్ని ఇడ్లీల తయారీలోనూ వినియోగించుకోవచ్చంటోంది బాలీవుడ్ నటి కరిష్మా తానా. తరచూ వంటింట్లో ప్రయోగాలు చేసే ఈమె ఈసారి కొబ్బరి చిప్పల్లో ఇడ్లీలు తయారు చేసి ఆశ్చర్యపరిచింది. ఆవిరి మీద తయారు చేసే వంటకాలకు కొబ్బరి చిప్పలే బెస్ట్‌ అని చెప్తోంది. ప్రస్తుతం 'కోకొనట్‌ షెల్‌ ఇడ్లీ' నెట్టింట వైరల్‌గా మారింది.

కొబ్బరి చిప్పల్లో ఇడ్లీ.. ఐడియా అదుర్స్

కొబ్బరి చిప్పలను పెన్‌ స్టాండ్‌గా, వాల్‌ హ్యాంగర్స్‌గా, నైట్‌ ల్యాంప్స్‌గా తీర్చిదిద్దుతున్నారు. జీరో వేస్ట్‌పై అవగాహన ఫలితంగా వృథాగా పడేసే ఎన్నో రకాల వస్తువులను ఇంట్లో వివిధ పనుల కోసం ఉపయోగిస్తున్నారు. కరిష్మాకు కొత్త కొత్త వంటకాలు ప్రయత్నించడం ఇదేం కొత్త కాదు. తన వంటగదిని ప్రయోగశాలగా మార్చేసిన ఆమె తాజాగా కొబ్బరి చిప్పల్లో ఇడ్లీ ఆలోచనతో ముందుకొచ్చింది. తన ప్రయోగం సక్సెస్ కావడంతో అందరికీ పరిచయం చేసేందుకు వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది.

తయారీ ఇలా

మూడు ఎండు కొబ్బరి చిప్పలను శుభ్రం చేసుకుని లోపల వైపు నూనె రాసింది. ఒక్కో దాంట్లో సగం వరకు ఇడ్లీ పిండి నింపి ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరిపై ఉడికించింది. అంతే! నిమిషాల్లో రుచికరమైన ఇడ్లీలు రెడీ కాగా నూనె, కారం పొడితో రుచి చూసింది కరిష్మా. కొబ్బరి చిప్పల్లో వేడి సమానంగా తగిలి ఇడ్లీలు లోలోపలి వరకు ఉడుకుతాయని, ఫలితంగా ఇడ్లీలు మెత్తగా, రుచిగా వస్తాయని తెలిపింది. ఈ నిజానికి వంటకంలో ఏదో ఒక తెలియని మ్యాజిక్‌ దాగుందని, ఇది మనసునూ ఆహ్లాదపరుస్తుందని చెప్పుకొచ్చింది. కరిష్మా పోస్ట్‌ చేసిన 'కొబ్బరి చిప్పల్లో ఇడ్లీ' వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ ఫ్యాషనర్!

కొంగొత్త రుచుల్ని ఆస్వాదించేందుకు ఇష్టపడే కరిష్మా తన కిచెన్​లోనే వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటుంది. ఈ మేరకు గతంలోనూ ఫేమస్ పలు వంటకాలను పరిచయం చేసింది. ఓట్‌మిల్క్‌-క్యారట్‌తో హల్వా తయారు చేసి ఆ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది. ఇక సమయం దొరికినప్పుడల్లా తన పాకశాస్త్ర నైపుణ్యాలను సోషల్ మీడియాలో ప్రదర్శించే ఈ బుల్లితెర తార ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌, ఫ్యాషనర్‌ కూడా! వర్కవుట్లు, ట్రెండింగ్ ఫ్యాషన్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోల్ని సైతం పోస్ట్‌ చేస్తూ ఇన్‌ఫ్లుయెన్సర్‌గానూ పేరు తెచ్చుకుందీ ఈ బ్యూటీ.

‘బిగ్‌బాస్‌’ బ్యూటీ!

బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన కరిష్మా నాగిన్‌-3, ఖయామత్‌ కీ రాత్‌ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో బుల్లితెర ప్రేక్షకుల మనసులు గెలిచిన ఈ చిన్నది 2013లో గ్రాండ్ మస్తీ చిత్రంతో వెండితెరపై అరంగేట్రం చేసింది. 2014లో హిందీ బిగ్‌బాస్‌ షోలో తొలి రన్నరప్‌గా నిలిచింది. పెట్‌ లవర్‌ అయినటువంటి కరిష్మా 'కోకో' కుక్కపిల్లను పెంచుకుంటోంది. ప్రత్యేకంగా ఇన్‌స్టా ఖాతా నిర్వహిస్తూ కోకో విశేషాల్ని అందులో పోస్ట్‌ చేస్తుంటుంది. ప్రస్తుతం 76 లక్షల మందికి పైగా ఫాలోవర్లున్నారు.

ప్రాణాలకు తెగిస్తేనే 'డేరియన్ గ్యాప్' దాటేది - అమెరికా అక్రమ వలసల మార్గమిదే!

LIC 'అన్‌క్లెయిమ్డ్‌ మనీ' రూ.800కోట్లు - మీ డబ్బు కూడా ఉందేమో చెక్‌ చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.