చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం కె.వి. పల్లి మండలంలో కలకలం నెలకొంది. సుమారు 45 ఏళ్ల గుర్తు తెలియని మహిళ మృతదేహం సంచిలో లభించింది. గ్యారంపల్లి పంచాయతీ కస్పాకు సమీపంలో చిత్తూరు-కడప జాతీయ రహదారికి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. నాలుగు రోజుల క్రితం మహిళను ఎక్కడో హత్య చేసి.. మూటకట్టి పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పొలం యజమాని మృతదేహాన్ని గుర్తించి.. తమకు సమాచారం ఇచ్చినట్లు ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు.
ఇవీ చదవండి...ప్రియురాలిని దారుణంగా హతమార్చిన ప్రియుడు