ETV Bharat / state

' పర్యాటక ప్రదేశాల పరిశుభ్రతే మా లక్ష్యం ' - ప్రపంచ పర్యాటక దినోత్సవం

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా  గొలగమూడి ఐఐటీటీఎం కళాశాల యువతతో ​ఈటీవీ భారత్ ముఖాముఖి నిర్వహించింది.

పర్యాటక ప్రదేశాల
author img

By

Published : Sep 28, 2019, 12:05 AM IST

' పర్యాటక ప్రదేశాల పరిశుభ్రతే మా లక్ష్యం '

నెల్లూరు జిల్లాలోని గొలగమూడి కళాశాలతో ఈటీవీ భారత్ ముఖాముఖి నిర్వహించింది. ఆసక్తిగా పాల్గొన్న యువత ....' పర్యాటక అభివృద్ధిలో స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వాలని...కాలుష్యం లేని అహ్లదకరమైన వాతావరణం కావాలని....ప్లాస్టిక్ నిరోధించాలంటూ..సముద్రతీరాన్ని శుభ్రం చేద్దాం '... పిలుపునిచ్చారు . అలా ఉండాలంటే పరిసరాల్లో వ్యర్ధాలు లేకుండా చేయాలి. ప్రధానంగా ప్లాస్టిక్​ను నిరోధించాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలను వారు అంటున్నారు.

పడవ ఎక్కుతూ నీటిలో జారిపడిన విద్యార్థి... కాపాడిన మేనమామ

Intro:ap_knl_72_27_bamma_bommalu_balaa_vo_pkg_ap10053

యాంకర్ పార్ట్ -

అందమైన బొమ్మలు అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమే బొమ్మల తయారీ ఒక ప్రత్యేకమైన కళ .....మనం వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైన బొమ్మలను చూశాం ....వ్యర్థాలకు అర్థం చెప్పేలా ఆకర్షణీయమైన బొమ్మలు తయారు చేస్తూ అబ్బురపరుస్తోంది ఆదోని బామ్మ.

వాయిస్ ఓవర్ -

కర్నూలు జిల్లా ,ఆదోని కి చెందిన 73 ఏళ్ల రాధాబాయి, ఓ వినూత్న రీతిలో అందమైన బొమ్మలు తయారు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది .వృధాగా మిగిలిన బట్టలు ,దూది ఇనుమును ముడిసరుకుగా ఉపయోగించి భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే .....ఎన్నో ఆకర్షణీయమైన బొమ్మలు తయారు చేస్తూ బొమ్మల తయారీలో ఒక సరికొత్త విధానాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది బామ్మ. ఆకట్టుకునే రూపంతో పాటు అద్భుతమైన చేతి పనితనానికి ఉదాహరణగా నిలుస్తున్నాయి రాధాబాయి చేసిన బొమ్మలు .రాధా కృష్ణులు, శివ పార్వతి లు, రాముడు సీత ,వెంకటేశ్వరస్వామి, పాండురంగడు గణపతి ,ఆంజనేయ స్వామి, లక్ష్మీదేవి, వంటి ఆధ్యాత్మిక ప్రతిమలతో పాటు తెలుగింటి సాంప్రదాయాలు కు అద్దం పట్టేలా పల్లకిలో పెళ్లికూతురు, పల్లెటూరు ఆడపడుచుల బొమ్మలను తయారు చేసింది .10 సంవత్సరాల క్రితం బెంగళూరు ఇస్కాన్ టెంపుల్ లో ఓ అందమైన బొమ్మ ని చూసి తను అలాంటి అందమైన బొమ్మలను తయారు చేయాలని నిర్ణయించుకున్న రాధాబాయి దాదాపు ఆరువందల రకాల బొమ్మలను తనదైన వినూత్నరీతిలో తయారుచేసింది .కర్నూలు జిల్లా నుంచే కాకుండా జిల్లా సరిహద్దులో ఉన్న కర్ణాటక నుంచి కూడా పలువురు గృహప్రవేశాలు ,పెళ్లిళ్లు, పండుగల సందర్భంగా ఈ బొమ్మలను తీసుకెళ్తూ ఉంటారు .ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం బొమ్మల తయారీ పట్ల ఉన్న ఇష్టంతోనే వృద్ధాప్యంలోనూ ఎంతో శ్రమిస్తూ అందమైన బొమ్మలు చేస్తోంది. నైపుణ్యం ఉన్న కళాకారులకు ఏమాత్రం తీసిపోని విధంగా తనకున్న కళా దృష్టి, ఏకాగ్రతతో రెండు మూడు రోజులపాటు శ్రమించి ఒక్కో బొమ్మను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. ఈ వయసులోనూ ఎవరి సహాయం లేకుండా ఒంటరిగానే తనకి కావలసిన వస్తువులు సమకూర్చుకొని ఎంతో ఓపికతో అద్భుతమైన బొమ్మలు తయారు చేస్తోంది.


Body:.


Conclusion:.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.