ETV Bharat / state

విద్యావంతుల గ్రామంగా మారుమూలపల్లె.. మన రాష్ట్రంలోనే! - AP Latest News

Tirumalammapalem: అభివృద్ధిలో ఆ గ్రామం వెనుకబడినా ప్రతి ఇంటిలో సరస్వతీ కొలువుతీరింది. ప్రగతికి ఆమడ దూరంలో ఉన్నా.. చదువుకోవాలనే వారి సంకల్పం ఉన్నతస్థానంలో నిలబెట్టింది. వైద్యులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, ఉపాధ్యాయులు.. ఇలా ప్రతి ఇంటిలోనూ ఏదో ఒక ఉద్యోగం. వ్యవసాయం, కూలిపనులు చేసుకుంటూ పిల్లల్ని చదివించి ప్రయోజకుల్ని చేశారు. అక్కడ ఒక్క మద్యం దుకాణం కనిపించదు. మద్యపాన నిషేధం కోసం గట్టిగా పోరాడి.. బెల్టు షాపు కూడా లేకుండా చేశారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న గ్రామాన్ని మనమూ చూసొద్దాం పదండి.

Tirumalammapalem
Tirumalammapalem
author img

By

Published : Mar 2, 2023, 9:29 AM IST

విద్యావంతులతో చదువులమ్మపాళెంగా విరాజిల్లుతోన్న మారుమూలపల్లె.. మన రాష్ట్రంలోనే!

Tirumalammapalem: స్వాతంత్రం వచ్చిన తొలిరోజుల్లోనే పాఠశాల తీరప్రాంత గ్రామం.. తిరుమలమ్మపాళెం. తీవ్రంగా వెనుకబడిన ప్రాంతం.. ఆలోచనలు ఆదర్శం.. సారా నిషేధం. మద్యం దుకాణం లేని గ్రామం. చదువుకోవాలనే చైతన్యం.. చదువులమ్మపాళెం.. తిరుమలమ్మపాళెం అంటే నెల్లూరు జిల్లాలో తెలియని వారంటూ లేరు. చదువులమ్మపాళెం తిరుమలమ్మపాళెం అనే నానుడి. సముద్ర తీరం గ్రామం. అభివృద్ధిలో వెనుకబడినా ప్రతి ఇంటిలో సరస్వతీ కొలువుతీరి ఉంది. చదువు జీవితాలను మారుస్తుందని స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లోనే పాఠశాలకోసం పోరాటంచేసి సఫలమయ్యారు. మద్యానికి దూరం ఆ గ్రామం. అనేక మంది ఉద్యోగులు. వైద్యులు. ఇంజనీర్లు ఉన్న వెంకటాచలం మండలంలోని ఆదర్శ గ్రామంపై ప్రత్యేక కథనం.

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం తిరుమలమ్మపాళెం తీరప్రాంత గ్రామం. నేటికి అభివృద్ధికి నోచుకోని గ్రామం. ఈ గ్రామస్థులు అభివృద్ధి పనులకన్నా పిల్లల చదువులకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రభుత్వాన్ని నిందించరు.. పొలం పనుల్లో ఉంటారు. పంటలు పండించుకుంటూ పిల్లలను చదివించుకుంటారు. ఉన్నతంగా చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని నమ్ముతారు.. మారుమూల గ్రామమైనా ఇక్కడ విద్యావంతుల సంఖ్య అత్యధికం. అక్షరాస్యత సుమారు 90పైనే ఉంటుందని ఆ గ్రామాన్ని చూస్తే ఎవరూ నమ్మరు. స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లోనే పోరాటం చేసి పాఠశాలను తెచ్చుకున్నారు. దానితో ఆ గ్రామంలోని ప్రజల పరిస్ధితి మారిపోయింది. చుట్టూ కర్రలతో రక్షణ గాదడులు కట్టుకుని ఉంటారు. మట్టి ఇళ్లు ఎక్కువ కనిపిస్తాయి. తక్కువగా మిద్దేఇళ్లు ఉంటాయి.

గ్రామం ప్రత్యేకత ఏమంటే.. మద్యానికి దూరంగా ఉంటారు. ప్రభుత్వ మద్యం దుకాణాన్ని వ్యతిరేకించారు. కనీసం బెల్ట్ దుకాణం కూడా లేదు. చుట్టుపక్కల గ్రామాల్లో మద్యం దుకాణాలు ఉంటాయి. ఈ గ్రామంలో కనిపించవు. మద్యం కూడా తాగకుడదనే నిబంధనలు పెట్టుకున్నారు. ఈ చైతన్యం రావడానికి కారణం అందరూ చదువుకోవడమేనని అంటారు. రాజకీయాలు ఉండవు. ఐకమత్యంగా ఉంటారు. ఎన్నికల సమయంలోనూ నచ్చిన వారికి ఓటువేసుకుంటారు. వందేళ్లుగా గొడవలు లేని గ్రామంగా పేరు ఉంది. జనాభా 1800. ఓటర్లు 1200మంది ఉన్నారు. ప్రభుత్వ వైద్యులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, పోలీసు ఉద్యోగాల్లో అనేక మంది ఉన్నారు. ప్రతి ఇంటిలో సాఫ్ట్​ వేర్ ఉద్యోగస్థులు ఉన్నారు. 30మందికిపైగా వైద్య వృత్తిలో ఉన్నారు. కొందరు విదేశాల్లోనూ ఉన్నారు.

సారా కాసే ఈ గ్రామంలో మహిళల చైతన్యం కారణంగా కనీసం కల్లు కూడా ఇక్కడ విక్రయించరు. మద్యం లేక పోవడంతో ఎన్నికల సమయంలో గొడవలు ఉండవు. ప్రశాంతమైన గ్రామంగా చెప్పుకుంటారు. తల్లితండ్రులు కూడా తమ పిల్లలను చదివించడానికి ఆసక్తి చూపిస్తున్నారని ఉపాధ్యాయులు అంటున్నారు.. మద్యం లేక పోవడంతో ఆర్థికంగా, ఆరోగ్య పరంగా మెరుగ్గా ఉన్నారు. వరదలు వచ్చాయంటే గ్రామం నాలుగు రోజులు బాహ్య ప్రప్రంచంతో సంబంధాలు తెగిపోతాయి. గ్రామం జలదిగ్భంధంలో ఉంటుంది. వంతెన నిర్మాణం చేయాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.