నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన డీఆర్‌డీఏ - వైఎస్సార్ క్రాంతి పథం ప్రాజెక్టులో పనిచేసే ఏపీఎం వి.బుజ్జమ్మ, సీసీ పి.లక్ష్మీకుమారి, అకౌంటెంట్ లక్ష్మీదేవిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు డీఆర్‌డీఏ పీడి శీనానాయక్ వివరాలు వెల్లడించారు. అనంతసాగరం మండలంలో పలువురు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి, వెబ్సైట్ పనిచేయకపోవడం వల్ల మాన్యువల్ ట్రక్ షీటుతో మిల్లులకు ధాన్యాన్ని పంపించారు. సాధారణంగా ఆన్‌లైన్‌లో బ్యాంక్ గ్యారెంటీలతో ట్రక్‌షీటు ద్వారా మిల్లులకు ధాన్యాన్ని పంపిణీ చేస్తేనే నిధులు మంజూరవుతాయి. 188 మంది ధాన్యాన్ని పంపగా 33 మంది రైతులకు మాత్రమే బ్యాంక్ గ్యారెంటీ లభించింది. ఈ విషయం మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం. రైతులను ఇబ్బందులకు గురి చేశారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే కారణంతో ఏపీఏం, సీసీ, అకౌంటెంట్‌లను కలెక్టర్ సస్పెండ్ చేసినట్లు డీఆర్‌డీఏ పీడి తెలిపారు.
ఇదీ చదవండి..