తాళం వేసిన ఇళ్లను పగటి పూట లూటీ చేసే ఓ దొంగను నెల్లూరు జిల్లాలో... పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ దొంగ నుంచి రూ.15 లక్షలు విలువైన 316 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 22న సైదాపురం మండలం అనంతమడుగులోని ఓ ఇంట్లో చోరీ జరగటంతో... ఇంటి యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చిత్తూరు జిల్లా తొట్టంబేడుకు చెందిన పరుశురాం అనే వ్యక్తి చోరీలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించి.. అతడిని అరెస్టు చేశారు. రూ.15లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగ సైదాపురం, గూడూరు, డక్కిలి, వెంకటగిరి, బాలాయపల్లి ప్రాంతాల్లో 7 ఇళ్లలో చోరీ చేసినట్లు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు.
ఇదీ చదవండి:
ఎస్వీబీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సాయికృష్ణ యాచేంద్ర