ETV Bharat / state

పెట్టుబడి రాదు.. గిట్టుబాటు కాదు!

నెల్లూరు జిల్లా ధాన్యం రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతోందని.. క్షేత్రస్థాయిలో పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతి రోజు ఒక నిర్ణయం తీసుకోవటం... ఆ నిర్ణయాన్ని మిల్లర్ల దృష్టికి తీసుకెళ్లడం.... వారు సరే అనటం పరిపాటిగా మారింది. చివరకు రైతుకు మాత్రం మద్దతు ధర లభించడం లేదు. ఈ పరిస్థితులపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

The situation of the grain farmers of Nellore district has become impassable.
నెల్లూరు జిల్లా ధాన్యం రైతుల పరిస్థితి
author img

By

Published : Sep 15, 2020, 1:40 PM IST

నెల్లూరు జిల్లా ఎడగారు సీజన్​లో వరి పండించిన రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని మాటలు చెబుతున్నారు తప్ప... క్షేత్రస్థాయిలో కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేమ శాతం ఉన్నాయని ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వ ఉన్నతాధికారులు 25 శాతం తేమ ఉన్నా.. 960 కిలోలు ఇచ్చి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు రైతులకు సైతం సరే అన్నాా.. క్షేత్ర స్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు.

వారు చెప్పిన రేట్లకే అమ్మాలి..

ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువెళ్లినప్పుడు తేమ శాతం 25 గా... క్వింటాకు వంద కిలోలు ఎక్కువగా ఇవ్వాలంటూ మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. దిగుబడులు భారీగా తగ్గిన పరిస్థితుల్లో.. కౌలు రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం మూల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసిందని.. అది ప్రకటనలకే పరిమితం అవుతుంది తప్ప... ఆ నిధులు ఖర్చు పెట్టడం లేదని రైతులు తెలిపారు.

ప్రభుత్వం విఫలం..

ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందని రైతు నాయకులు మండిపడుతున్నారు. రైతులు ధాన్యాన్ని మిల్లర్లు వద్దకు తీసుకెళితే వెళితే మచ్చలు ఉన్నాయి అంటూ, వెనక్కి పంపుతున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో చేసేదేమీలేక అన్నదాతలు... వ్యాపారులు చెప్పిన రేట్లకే అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారులు సహకరించట్లేదు...

ప్రభుత్వం అనేక కారణాలు చెప్పి మిల్లర్లలను ఇబ్బంది పెడుతోందని రైస్ మిల్లర్ అసోసియేషన్ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం తేమ శాతం 25% ఉన్నా 960 కిలోలకు ధాన్యం కొనుగోలు చేయమని చెప్పటం నిజమే.. కానీ నలుపు, ఎరుపు మచ్చలు వస్తున్న ధాన్యం కూడా కొనుగోలు చేయాలంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కొనుగోలు చేయాలని చెబుతారు కానీ... రాష్ట్ర స్థాయి అధికారులు మాత్రం మిల్లర్లకు సహకరించడం లేదని.... కంప్యూటర్​లు ఆపేస్తున్నారని వారు మండిపడుతున్నారు.

ఇదీ చదవండి:

కదిలిన జ్ఞాపకం.. స్పందించిన మానవత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.