నెల్లూరు జిల్లా నాగమాంబపురం విలియమ్స్ పేటలలో ఇంటి నిర్మాణ వివాదం ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో బుచ్చిరెడ్డిపాలెంలోని జొన్నవాడ కామాక్షిమాత దేవస్థానం మాజీ ఛైర్మన్ పుట్టీ సుబ్రహ్మణ్యానికి గాయాలయ్యాయి. సుబ్రహ్మణ్యం ఇంటి ముందు మరొకరు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించడంతో వివాదం మెుదలైంది. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తింది. గాయాలపాలైన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెదేపా నేత అయిన బాధితుడిని ఆ పార్టీ నాయకులు పరామర్శించారు. వైకాపా నాయకుల ప్రోద్బలంతోనే ఈ దాడి జరగిందని ఆరోపించారు.
ఇదీచదవండి