నెల్లూరు జిల్లా అనాసాగరం మండలం మిలగల్లులో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో తెదేపా నేత వెంగయ్య మృతి చెందగా, అతని కుటుంబానికి చెందిన మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వైకాపా నేతలే దాడి చేసి.. హత్య చేశారని తెదేపా వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఘటనలో గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి : ''మా వాడు పోలీసుల కారణంగానే చనిపోయాడు''