ETV Bharat / state

ఆత్మకూరు ఉప ఎన్నికకు తెదేపా దూరం ! - tdp on atmakur bypoll elections

ఆత్మకూరు ఉప ఎన్నికకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండనుంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తెదేపా పోటీ చేయకపోయినప్పటికీ.. వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు తక్కువే. భాజపా సహా మరికొన్ని పార్టీలు తమ అభ్యర్థులను బరిలో నిలిపే అవకాశం ఉన్నందున ఎన్నిక జరిగేందుకే ఎక్కువగా ఆస్కారం ఉంది.

tdp on atmakur bypoll elections
ఆత్మకూరు ఉప ఎన్నిక
author img

By

Published : May 31, 2022, 3:17 PM IST

TDP on Atmakur Bypoll: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నికకు తెదేపా దూరంగా ఉండనుంది. మేకపాటి గౌతమ్​రెడ్డి​ కుటుంబ సభ్యులకే టిక్కెట్ ఇవ్వడంతో గతం నుంచి వస్తున్న సంప్రదాయాన్ని పాటించాలని తెలుగుదేశం భావిస్తోన్నట్లు సమాచారం. గతంలో బద్వేలు ఉప ఎన్నికలోనూ తెదేపా ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో త్వరలో దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జగన్​ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గౌతమ్​ రెడ్డి హఠాన్మరణం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆత్మకూరులో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నిక సంఘం నోటిఫికేషన్​ జారీ చేసింది.

Schedule Release: నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికకు నగారా మోగింది. జూన్‌ 23న పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వైకాపా తరఫున పోటీ చేసి ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఐటీ, పరిశ్రమల మంత్రిగా పని చేసిన మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 21న మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఇప్పుడు ఉపఎన్నిక జరగనుంది. దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 7 శాసనసభ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్‌ విడుదల చేసింది.

...

ఏకగ్రీవ అవకాశాలు తక్కువే!: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా మేకపాటి విక్రమ్‌రెడ్డి బరిలో దిగనున్నారు. ఆయన దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు. మృతుడి కుటుంబ సభ్యులే పోటీలో ఉన్నందున ప్రధాన ప్రతిపక్షమైన తెదేపా... గతం నుంచి పాటిస్తున్న సంప్రదాయాన్నే ఈసారీ పాటించాలని భావిస్తోంది. అయితే తెదేపా పోటీ చేయకపోయినప్పటికీ.. వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు తక్కువే. భాజపా సహా మరికొన్ని పార్టీలు తమ అభ్యర్థులను బరిలో నిలిపే అవకాశం ఉన్నందున ఎన్నిక జరిగేందుకే ఎక్కువగా ఆస్కారం ఉంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.