మద్యం దుకాణాలే కరోనా ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయని.. నెల్లూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుటు తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న సమయంలో.. మద్యం దుకాణాలు మూసివేయాలని నుడా మాజీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు.
వివాహాలకు పరిమిత సంఖ్యలో అనుమతించే ప్రభుత్వం.. మద్యం దుకాణాల వద్ద వందల సంఖ్యలో మందుబాబులు చేరుతున్నా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం దుకాణాల వద్ద కనీస జాగ్రత్తలు పాటించటం లేదని ఆరోపించారు. ప్రజలను కరోనా నుంచి రక్షించేందుకు.. ఇప్పటికైనా మద్యం దుకాణాలు మూసివేయాలని సూచించారు.
ఇదీ చదవండి: