Nellore TDP Incharge Kotamreddy Srinivasulu Reddy:నెల్లూరు నగర తెదేపా ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డిని కారుతో గుద్ది రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు పరారయ్యాడు. నగరంలోని బాలాజీనగర్‌లోని ఆయన ఇంటివద్ద రోడ్డు మీద ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కోటంరెడ్డి కుమారుడు డాక్టర్ ప్రజయ్ స్నేహితుడు రాజశేఖర్ రెడ్డి ఇంటికి వచ్చి గొడవకు దిగాడని కోటంరెడ్డి బంధువులు తెలిపారు. రాజశేఖర్ రెడ్డి తాగి ఇంటికి వచ్చి గొడవ చేశాడని, సర్ధి చెప్పి బయటవరకు వదిలారని.. రాజశేఖర్ రెడ్డి తాగిన మైకంలో కారుతో కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని ఢీ కొట్టి పరారయ్యాడని కుటుంబసభ్యులు చెప్పారు. రోడ్డుపై పడిపోయిన శ్రీనివాసులరెడ్డిని హుటాహుటినా అపోలో ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు.
కాలుకు ఫ్యాక్చర్ అయ్యిందని వైద్యులు పేర్కొన్నారు. చికిత్స కొనసాగుతున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరారైన రాజశేఖర్ రెడ్డి కోసం గాలిస్తున్నామన్నారు. ఈ ఘటనపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని అన్నారు. యువత మద్యం మత్తులో ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటికి వచ్చి వార్నింగ్ ఇవ్వడం డ్రగ్స్ ప్రభావమేనని ఆరోపించారు. జిల్లాలో డ్రగ్స్ మాఫీయా రాజ్యమేలుతోందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
ఇవీ చదవండి: