నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వెంకన్నపాలెంలో పోలీసుల దాడికి మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి.. చికిత్స పొందుతున్న దళితుడు వెంకటయ్యను తెదేపా దళిత నాయకులు పరామర్శించారు. వివాదాస్పద నివేశ స్థలాలను పరిశీలించారు. దళిత ఓట్లతో గెలిచిన వైకాపా ప్రభుత్వం వారికి రక్షణ లేకుండా చేస్తోందని విమర్శించారు. దళితుల భూములపై ప్రభుత్వం కన్ను పడిందని.. అందుకే వారిని భయాందోళనకు గురి చేస్తున్నారని తెదేపా దళిత నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
మనుబోలు మండలం వెంకన్నపాలెంలో వరద ముంపు ప్రాంతంలో నివేశ స్థలాలు వద్దన్ని అడ్డుకుంటున్న దళితులపై వైకాపా నాయకుల అండతో పోలీసులు భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు. హైకోర్టు స్టే ఉన్నా బలవంతంగా దళితులపై దాడికి పాల్పడిన ఘటనపై తెదేపా నిజ నిర్థారణ బృందం పర్యటించి వివరాలు సేకరించారు. వైకాపా ప్రభుత్వం అరాచకాలపై దళిత నేతలు మండి పడ్డారు.
ఇదీ చదవండి 'నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి'