ETV Bharat / state

'పరీక్షలు పెంచడం వల్లే కేసుల సంఖ్య పెరుగుతోంది' - నెల్లూరు లో మంత్రి ఆళ్లనాని సమావేశం

నెల్లూరులో కరోనా వ్యాప్తిపై మంత్రి ఆళ్లనాని సమావేశం నిర్వహించారు. బాధితులకు సహాయం అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ కనీస జాగ్రత్తలు పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని అన్నారు.

state health minister alla nani meeting in nellore For knowing corona details
నెల్లూరులో మాట్లాడుతున్న మంత్రి ఆళ్ల నాని
author img

By

Published : Aug 13, 2020, 5:14 PM IST

నెల్లూరు జిల్లాలో కరోనా స్థితిగతులపై ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని సమావేశం నిర్వహించారు. జిల్లాలోని కొవిడ్ కేర్ కేంద్రాలు, రీజనల్ కొవిడ్ సెంటర్ జీజీహెచ్, నారాయణలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కరోనా పరీక్షలు పెరిగినందున కేసుల సంఖ్య పెరుగుతోందని ఆయన అన్నారు.

ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటం మంచి పరిణామమని పేర్కొన్నారు. బాధితులకు సహాయం అందించేందుకు 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్స్​తో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. కరోనా మృతుల పట్ల మానవత్వాన్ని చూపాలని కోరారు.

ఇదీ చదవండి:

కరోనా బాధితులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మంత్రులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.