ETV Bharat / state

పల్లె గడపకు.. యువ అక్షర తోరణం

తొలిదశ పల్లెపోరులో నిలిచిన కొందరు విద్యావంతులు ఎన్నికయ్యారు. వారి జ్ఞానాన్ని గ్రామాభివృద్ధికి ఉపయోగించి, ప్రజల సమస్యలకు ఆధునిక పరిష్కారాలను కనుగొంటామంటున్నారు. తమ పల్లెలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతామంటున్నారు.

youngsters won in local body elections
పల్లె గడపకు.. యువ అక్షర తోరణం
author img

By

Published : Feb 11, 2021, 4:32 PM IST

తొలిదశ పల్లెపోరులో పలువురు విద్యావంతులు మెరిశారు. కొందరు ఏకగ్రీవం కాగ.. విభిన్న ఆలోచనలు, వైవిధ్య ప్రణాళికలతో మరికొందరు బరిలో నిలిచి అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ సర్పంచి పీఠాన్ని అందిపుచ్చుకున్నారు. చదువు నేర్పిన జ్ఞానాన్ని.. కొలువు నేర్పిన నైపుణ్యాన్ని మేళవించి.. పల్లెను ప్రగతిబాట పట్టించి ప్రజల మనస్సునూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న యువ నవ సర్పంచులపై ప్రత్యేక కథనం.

కొలువుకు స్వస్తి చెప్పి..

చక్కగా చదివి.. కొలువు సాధించినా.. తాను పుట్టిన ఊరికి ఏమైనా చేయగలనా అన్న తపన ఆమెను వెన్నాడింది. తన ఆలోచనలను గ్రామస్థులతో పంచుకున్నారు. అన్ని పక్షాల మద్దతు పొంది.. 22 ఏళ్ల వయస్సులోనే జలదంకి మండలం చినక్రాక సర్పంచిగా ఎన్నికయ్యారు పులి సుస్మిత. భాస్కర్‌, వజ్రమ్మ దంపతుల రెండో కుమార్తె సుస్మిత. తల్లిదండ్రుల జీవనాధారం వ్యవసాయం. బీ ఫార్మసీ పూర్తి చేసి.. హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేసే ఈమె.. దానికి రాజీనామా చేసి.. పల్లెపోరులో నిలిచి సర్పంచిగా ఎన్నికయ్యారు. గ్రామస్థులు, గ్రామ పెద్దల సహకారంతో తాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు అంతర్గత రోడ్లు, పారిశుద్ధ్యం మెరుగుపరిచి తమ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెబుతున్నారు.

బిడ్డ సర్పంచి.. తండ్రి ఉపసర్పంచి..

వరికుంటపాడు మండలం తూర్పుపాలేనికి చెందిన పాలకొల్లు ఉమామహేశ్వరి 25 ఏళ్ల వయస్సులోనే విరువూరు సర్పంచిగా ఎన్నికయ్యారు. ఎంబీఏ చదివిన ఈమె.. 15 ఏళ్ల కిందట ఉప సర్పంచిగా, ప్రస్తుత ఎన్నికల్లోనూ ఉప సర్పంచిగా ఎన్నికైన తండ్రి భాస్కర్‌రెడ్డి స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, ముఖ్యంగా పంచాయతీలోని మూడు గ్రామాల్లో తాగునీరు, వీధి దీపాలు, సీసీరోడ్లు,డ్రెయినేజీ కల్పించడంతోపాటు పరిశుభ్రతకు పాటుపడుతానని చెబుతున్నారు. తాము వ్యాపార రీత్యా నెల్లూరులో స్థిరపడినా.. ఊరిపై మమకారంతోనే తిరిగి వచ్చామని వివరించారు.

‘బీటెక్‌’ ప్రణాళిక

ఇటీవలే ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన అల్లం కవిత 22 ఏళ్ల వయస్సులో యలమంచిపాడు పంచాయతీ బరిలో నిలిచి సర్పంచిగా విజయం సాధించారు. చదువు పూర్తయిన వెంటనే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చింది. తల్లిదండ్రులు హనుమంతరావు, శీనమ్మ ప్రోత్సాహంతో బరిలో నిలిచా. గ్రామస్థుల సహకారంతో విజయం సాధించా. వారి నమ్మకాన్ని నిలుపుకొంటూ.. వారిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ గ్రామాభివృద్ధికి పాటుపడతానని అంటున్నారు. గ్రామ సమస్యలను గుర్తించి.. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో పరిష్కరిస్తానని తెలిపారు.

గ్రామాభివృద్ధికి సాఫ్ట్‌వేర్..‌

గ్రామాభివృద్ధే లక్ష్యంగా తాను రాజకీయ ప్రవేశం చేసినట్లు తూర్పుగుడ్లదొన పంచాయతీ ఒకటో వార్డు విజేత, ఉపసర్పంచి పట్నం రవీంద్ర అన్నారు. ఎంటెక్‌ చదివిన ఈయన 13 ఏళ్లు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పని చేశారు. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్‌ సర్వీసెస్‌ అనే సంస్థను స్థాపించి నాలుగేళ్లుగా దాని యజమానిగా కొనసాగుతున్నారు. స్థిరాస్తి, నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టిన ఈయన- తండ్రి పట్నం వెంకటేశ్వర్లు స్ఫూర్తితో ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు. నెలలో పది రోజులు గ్రామంలో ఉండేలా ప్రణాళిక రూపొందించుకున్నానని, గ్రామాభివృద్ధికి వసతుల కల్పన, పేదలకు చేయూత ఇవ్వాలనే లక్ష్యంతో ఇప్పటికే ఓ ట్రస్టును రిజిస్టర్‌ చేశానని తెలిపారు. అనుకున్నది చేసి ఊరిని ఆదర్శంగా తీర్చిదిద్దుతానంటున్నారు.

అలా తెలుసుకుని.. ఇలా అడుగిడి..

ఇంటర్మీడియెట్‌ చదివి.. వాలంటీరుగా సేవలందిస్తున్న 26 ఏళ్ల పేర్నంపాటి పెదమౌలాలి తోటలచెరువుపల్లె సర్పంచిగా గెలుపొందారు. గ్రామంలో ఎలాంటి సమస్యలుంటాయో... గ్రామస్థులు ప్రధానంగా ఏం కోరుకుంటారనే అంశాలు వాలంటీరుగా అవగతమయ్యాయని, అక్కడ అందించిన సేవల సారంతో తమ పంచాయతీలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అంటున్నారు. వీధుల్లో సీసీ రోడ్లు వేయించి.. డ్రెయినేజీ సౌకర్యం కల్పించడంతో పాటు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తానని చెబుతున్నారు. ప్రజలందరి సహకారంతో వారికి గుర్తుండిపోయేలా పని చేస్తానని పేర్కొన్నారు.

ఆశలు వమ్ము చేయను..

చలంచర్ల పంచాయతీ నుంచి సర్పంచిగా ఎన్నికైన ఇరువూరి అనూష ఇంజినీరింగ్‌ పట్టభద్రురాలు. ప్రాంగణ ఎంపికల్లోనూ కొలువు సాధించారు. అంతలోనే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో.. కొలువును వదిలి.. సర్పంచి బరిలో నిలిచి.. విజయం సాధించారు. ప్రజాసేవ చేయాలన్న నా ఆలోచనకు తల్లిదండ్రులు, ఊరి ప్రజల ఆశీస్సులు లభించడం ఆనందంగా ఉంది. గ్రామాభివృద్ధి దిశగా పటిష్ఠ ప్రణాళిక రూపొందించుకుని.. ఆచరణకు కృషి చేస్తా. ప్రజల ఆశలను అడియాసలు చేయకుండా పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు.

వారధిగా నిలుస్తా..

బోగోలు మండలం చెన్నారాయునిపాళెం పంచాయతీ సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కొమరి గిరిబాబు ఎంబీఏ పట్టభద్రుడు. తాను ఏకగ్రీవంగా ఎన్నికవడం ఆనందంగా ఉందని, అందుకు తగ్గట్టుగానే పని చేసి జన్మ సార్థకం చేసుకుంటానని చెబుతున్నారు. పెద్దలు, మేధావుల అనుభవాలు అందిపుచ్చుకుని గ్రామ ప్రగతికి తీసుకోవాల్సిన అంశాలపై ప్రణాళికలు రూపొందిస్తానన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విద్య, వైద్యం, తాగు నీటి సౌకర్యాల మెరుగుదలకు కృషి చేస్తానన్నారు. మత్స్యకార కుటుంబాల సమస్యలు తీర్చేందుకు వారధిగా నిలుస్తానని వివరించారు.

23 ఏళ్ల వయస్సులోనే..

కలిగిరి మండలం పోలంపాడు సర్పంచిగా 23 ఏళ్ల కల్లూరి రేష్మ విజయం సాధించారు. డిగ్రీ చదివిన ఈమె సర్పంచి స్థానం అన్‌ రిజర్వుడ్‌ మహిళకు కేటాయించడంతో.. మామ చంద్రమౌళి ప్రోత్సాహంతో బరిలో నిలిచారు. అంచనాలను తలకిందులు చేస్తూ 104 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. పంచాయతీలో ఎనిమిది వార్డులు ఉండగా- అయిదింటిలో రేష్మ తరఫు వ్యక్తులే విజేతలుగా నిలిచారు. గ్రామ పెద్దలు, మామయ్య సలహాలు, సూచనలతో పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

ఇదీ చదవండి:

ఫ్యాన్​కు ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.