నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని స్థానిక చెక్ పోస్ట్ సెంటర్ సమీపంలో ఉన్న జాతీయ రహదారి కూడలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి సిమెంట్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇంజిన్, ట్యాంకర్ రెండు భాగాలుగా విడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగే సమయంలో రహదారిపై ఎవరూ లేకపోవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి