ETV Bharat / state

పీఎల్​ఎల్వీ- సీ49 ప్రయోగానికి సన్నద్ధమవుతున్న శాస్త్రవేత్తలు - శ్రీహరికోటలో పీఎస్​ఎల్వీ సీ49 ప్రయోగం

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్​ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్​ఎల్వీ- సీ49 ఉపగ్రహం ప్రయోగం ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు సన్నద్ధమవుతున్నారు. ఈ ప్రయోగాన్ని సందర్శకులు షార్​కు చేరుకుని చూసే అవకాశం లేదు.

pslv-c49 rocket satellite will be launching in sriharikota
షార్​లో పీఎస్​ఎల్వీ- 49 ప్రయోగం
author img

By

Published : Oct 29, 2020, 6:13 PM IST

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం శ్రీహరికోటలోని షార్​ నుంచి పీఎస్​ఎల్వీ- సీ49 ప్రయోగం జరిపేందుకు శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేస్తున్నారు. నవంబరు 7న మధ్యాహ్నం 3.02 గంటలకు ప్రయోగం జరిపేలా సన్నద్ధం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రయోగం విజయవంతం చేసేందుకు శాస్త్రవేత్తలు తమ పనుల్లో నిమగ్నమయ్యారు.

పీఎస్ఎల్వీ- సీ49 ద్వారా మన దేశానికి చెందిన ఈవోఎస్- 01(రీశాట్-2బీఆర్2)తో పాటు విదేశాలకు చెందిన 9 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్య లో ప్రవేశ పెట్టనున్నారు. కరోనా కారణంగా ఎవ్వరికీ ప్రవేశం లేకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. సందర్శకులు, మీడియాకు అనుమతి లేకుండా ప్రయోగం జరుగుతుందని ఇస్రో ప్రకటించింది.

ఇదీ చదవండి:

శ్రీహరికోటలోని షార్‌ ఉద్యోగులకు నేటి నుంచి వర్క్‌ ఫ్రం హోం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.