ముంబయిలోని డా.బీ.ఆర్.అంబేడ్కర్ ఇంటిని ధ్వంసం చేయడం దుర్మార్గమమని మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.1932లో దాదర్లో ఏర్పాటైన రాజాగృహపై దుండగులు దాడికి పాల్పడటం క్షమించరాని నేరం అని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి.. రాజాగృహానికి మరమ్మతులు చేసి.. భద్రత కల్పించాలని కోరారు.
ఇదీచదవండి.