నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంలో దూకి బలవన్మరణానికి యత్నించిన ఓ మహిళను కాపాడిన పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. కలువాయికి చెందిన లక్షమ్మ అనే మహిళ కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకోవాలనుకుని సోమశిల జలాశయంలో దూకింది.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన సోమశిల పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వేణు.. అక్కడికి చేరుకున్నాడు. వెంటనే నీటిలోకి దూకి ఆమెను రక్షించాడు. లక్షమ్మను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు. వేణును అందరూ శభాష్ అని మెచ్చుకుంటున్నారు.
ఇదీ చదవండి:
krishna board: రేపు రాయలసీమ ఎత్తిపోతల పర్యటనకు కృష్ణా బోర్డు బృందం