ETV Bharat / state

Damaged roads: అక్కడి రోడ్లు అంబులెన్స్‌ వేగాన్నే నియంత్రించేంత ఛిద్రం..! - నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దారుణంగా మారిన రోడ్ల దుస్థితి

అంబులెన్స్‌ అంటే వీలైనంత వేగంగానే వెళ్తుంటుంది. కుయ్‌..కుయ్‌.. అంటూ దూసుకెళ్తుంటుంది! కానీ.. ఆ రోడ్డెక్కితే అంబులెన్సే కాదు.. సీఎం కాన్వాయైనా కుయ్యో మొర్రో అని.. మొత్తుకోవాల్సిందే.! ఎందుకంటే ఆ రోడ్డులో టాప్‌ గేర్‌ వేయలేరు.! ఎక్సలేటర్‌ తొక్కలేరు..! అంబులెన్సు వేగాన్నే నియంత్రించే అలాంటి గొప్ప రోడ్లు చూసొద్దాం పదండి.

people suffer with damaged roads at atmakur in nellore
అక్కడి రోడ్లు అంబులెన్స్‌ వేగాన్నే నియంత్రించేంత ఛిద్రం..!
author img

By

Published : Oct 10, 2021, 6:09 PM IST

అక్కడి రోడ్లు అంబులెన్స్‌ వేగాన్నే నియంత్రించేంత ఛిద్రం..!

ఎంతటి ట్రాఫిక్‌లోనైనా సైరన్‌ వేసుకుని సర్రున దూసుకెళ్తే ఈ అత్యవసర వాహనం.. ఇదిగో ఈ రోడ్డు దెబ్బకు కుయ్యోమొర్రో అంటూ ఆపసోపాలు పడుతోంది. మన రాష్ట్రంలో పెట్టుబడులకు బంగారు బాటలు పరుస్తున్నామని ప్రకటిస్తున్న పరిశ్రమల శాఖ మంత్రి గౌతంరెడ్డి ఇలాఖాలో ఇలాంటి గొప్పరోడ్లు ఏమూలకు వెళ్లినా.. కిలోమీటర్ల కిలోమీటర్లున్నాయి.

గజానికో గుంత

ఆత్మకూరు నుంచి సోమశిల వెళ్లే ప్రధానమార్గం.. 60 గ్రామాల ప్రజలు వెళ్లే.. ఈ రోడ్డు దాదాపు 45కిలోమీటర్లుటుంది. గజానికో గుంతతేలిన ఈ రహదారిలో ప్రయాణం అంటేనే.. వాహనదారుల గుండెలు జారిపోతున్నాయి.

ప్రమాదకరంగా రాకపోకలు

ఇది ఆత్మకూరు నుంచి.. వింజమూరు వెళ్లే మార్గం. 30 గ్రామాల ప్రజలు ఈ దారిలో రాకపోకలు సాగించే ఈ మార్గంలో.. ఏడు చప్టాలున్నాయి. అవన్నీ కుంగిపోయి ప్రమాదకరంగా మారాయి. ఇటీవలి వర్షాలకు.. చిన్న చిన్న గోతులూ నీటి మడుగుల్లా మారాయి. అనేక చోట్ల తారు పెచ్చుపెచ్చులుగా.. లేచింది. రోజూ రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సులు, ఆటో డ్రైవర్లు.. పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయని వాపోతున్నారు.

అస్తవ్యస్థంగా రోడ్లు

ఆత్మకూరు బైపాస్‌రోడ్డు వీటికి తక్కువేమీకాదు.. గుంతలు తేలి నరకానికి నకళ్లుగా మారాయి. నియోజకవర్గ కేంద్రానికి చేరుకునే దారులే కాదు.. ఆత్మకూరు పురపాలకసంఘం పరిధిలోని రోడ్లూ అస్తవ్యస్థంగా మారాయి. వర్షం వస్తే బురదగా మారిపోతోంది. వాహనాలు జారి పడిపోతున్నాయి. అప్పారావుపాలెం, బట్టేపాడు, నల్లపురెడ్డిపల్లి గ్రామాలకు.. ఆత్మకూరు పురపాలక పరిధిలోని రోడ్లగుండానే వెళ్లాలి.వీటి పరిస్థితి ఎప్పటికి మారుతుందో అర్థాకావడం లేదంటున్నారు పురప్రజలు.

రోడ్లు బాగు చేయాలని వాహనదారుల వేడుకోలు

ఆత్మకూరు ప్రధాన రోడ్ల మరమ్మతులకు.. అధికారులు ప్రతిపాదనలు పంపారు. కానీ నిధులు మంజూరు కాలేదు. పనులు చేసేందుకు.. గుత్తేదారులూ ముందుకురావడంలేదు. రోడ్లు త్వరగా బాగు చేయాలని.. వాహనదారులు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:

jagananna colonies : లేఅవుట్లు వేసి వసతులు మరిచారు.. పట్టాలిచ్చి పైసలు మరిచారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.