ETV Bharat / state

నష్టపోయిన రైతులకు మద్దతుగా రేపు దీక్ష : పవన్ - రైతుపరిహారంపై పవన్ కామెంట్స్

నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు రూ. 35 వేల నష్టపరిహారం ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో రెండో రోజు పర్యటించిన ఆయన...తక్షణమే రైతులకు రూ.10 వేలు అందజేయాలన్నారు. రాష్ట్రంలో 17లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే శాసనసభలో ఒక్కరోజైనా చర్చ జరిగిందా ? అని వైకాపా ప్రభుత్వాన్ని నిలదీశారు. మద్యం అమ్మకాల వల్ల ప్రభుత్వానికి రూ.16 వేల కోట్ల ఆదాయం వస్తోందని...ఈ ఏడాది ఆ ఆదాయం రైతులకిచ్చి ఆదుకోవాలన్నారు.

మద్యం వల్లే వచ్చే ఆదాయాన్ని రైతులకు అందజేయండి

author img

By

Published : Dec 5, 2020, 4:43 PM IST

Updated : Dec 6, 2020, 5:20 AM IST

నివర్‌ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణ సాయంగా రూ.10 వేలు అందించాలి. ఎకరాకు రూ.35వేల పరిహారం ప్రకటించాలి. ప్రభుత్వం నుంచి ఈ మేరకు ఎలాంటి ప్రకటన రాని పక్షంలో రైతులకు మద్దతుగా ఈనెల 7న అన్ని జిల్లాల్లో జనసేన నిరసన దీక్షలు చేపడుతుంది’ అని జనసేనాని పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన శనివారం నెల్లూరు జిల్లాలోని కోవూరు, గూడూరు నియోజకవర్గాల్లోని దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. రైతులు, చేనేతల సమస్యలను తెలుసుకున్నారు. వెంకటగిరిలో నీరు చేరిన మగ్గం గుంతలను పరిశీలించారు. ఉదయం నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. ఎకరాకు రూ.35వేల పరిహారం జనసేన డిమాండ్‌ కాదని, అనేక మంది రైతుల గొంతుకేనని చెప్పారు. మనోనిబ్బరం కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరారు.

మద్యం ఆదాయం ఉందిగా..
వైకాపా నాయకత్వం మద్యం నిషేధిస్తామని తొలుత చెప్పి.. అంచెలంచెలుగా చేస్తామని మాట మార్చి చివరకు ప్రభుత్వమే విక్రయాలను చేపట్టిందని పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. బూమ్‌, సుప్రీం, ప్రెసిడెంట్‌ మెడల్‌, ఆంధ్రా గోల్డ్‌ అంటూ చిత్రవిచిత్రమైన బ్రాండ్లు అమ్ముతున్నారని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ విన్నాం కానీ.. బంగారు ఆంధ్రా అంటూ మద్యం బ్రాండ్ల రూపంలో అమ్మడం విడ్డూరమన్నారు. సీఎం మెడల్‌, వైసీపీ స్పెషల్‌ అని బ్రాండ్లు కూడా పెట్టి అమ్మి సొమ్ము చేసుకోండని విమర్శించారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయం రూ.16వేల కోట్లను తుపాను బాధిత రైతులకు కేటాయించాలని కోరారు. కడుపు మండిన రైతులు బయటకు వస్తే పరిస్థితులు మరోలా ఉంటాయని హెచ్చరించారు. తుపాను సమయంలో యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల బుగ్గవంక నీటిలో కడప నగరం మునిగిందని, 20వేల కుటుంబాలు గూడు కోల్పోయాయని వివరించారు.

విశ్వనగరం ఎన్నికలుగా చూశారు..
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ద్వారా ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నది స్పష్టమైందని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. నగర ఎన్నికలుగా వాటిని చూడలేదని, విశ్వనగర ఎన్నికలుగా చూశారని వివరించారు. భాజపా గెలుపులో జనసైనికుల మద్దతుకు ధన్యవాదాలు చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతుకు లబ్ధి చేకూర్చే నిర్ణయాలను కేంద్రం తీసుకున్నట్లు రైతు ఉద్యమంపై విలేకరుల ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. మనకున్న వ్యవస్థలో కొన్ని భయాలు, అపోహలు సహజమని.. ఎక్కడైనా సరే రైతులు తమకు అన్యాయం జరుగుతుందని చెప్పడం ప్రజాస్వామ్య లక్షణమని పేర్కొన్నారు.

వెంకటగిరి బహిరంగ సభలో మాట్లాడుతూ ఓటుకు రూ.2వేలు ఇస్తారని, అదే మొత్తం తడిసిన మగ్గానికి ఇవ్వాలని నాయకులకు సూచించారు. తాను రూ.కోట్లు తీసుకుని బ్రాండ్లకు ప్రమోషన్‌ చేయనని.. వెంకటగిరి చేనేత, పొందూరు ఖద్దరు వాడదామని చెప్పేవాడినని అన్నారు. మంగళగిరిలో చేనేత కార్మికుల కోసం ప్రత్యేక సదస్సు, వారి సమస్యలు ప్రభుత్వానికి తెలిసేలా చేనేత గర్జన, ర్యాలీ నిర్వహిద్దామని తెలిపారు. యువత తనను సీఎం సీఎం అని పిలుస్తుంటే బాధ్యతగా తీసుకుంటానని, ముఖ్యమంత్రిని కాకపోయినా తుదిశ్వాస వరకు సామాన్యులకు అండగా ఉంటానని చెప్పారు. ఒక్క ఛాన్స్‌ ఇస్తే అద్భుతాలు చేస్తానని చెప్పబోనని అన్నారు.

ఇదీ చదవండి: తలైవా.. తమిళ రాజకీయాలను మార్చేస్తారా?

Last Updated : Dec 6, 2020, 5:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.