ETV Bharat / state

ఎన్నికల విధుల్లో ఉద్యోగికి కరోనా పాజిటివ్​.. కాసేపు నిలిచిన ప్రక్రియ - కరోనా వార్తలు

నెల్లూరు జిల్లా ఎన్నికల విధుల్లో ఉన్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్​గా రిపోర్టు వచ్చింది. రెండు రోజుల క్రితం పరీక్షలు చేయించుకోగా నేడు ఫలితం రావడంతో.. అక్కడ పోలింగ్​ ప్రక్రియ కొంతసేపు నిలిచిపోయింది.

corona
ఎన్నికల నిధుల్లో ఉద్యోగికి కరోనా పాజిటివ్
author img

By

Published : Apr 17, 2021, 3:25 PM IST

నెల్లూరు జిల్లా కలువాయి మండలం పెరంకొండ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి ఒకరికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఒక్కసారిగా విషయం తెలియడంతో.. పోలింగ్ కేంద్రంలో అరగంటకుపైగా ఎన్నికల ప్రక్రియ నిలిపివేశారు.

పోలింగ్​ కేంద్రం పరిసరాలను రసాయనాలతో శుభ్రం చేసిన తరువాత ఎన్నికల ప్రక్రియను అధికారులు పునరుద్ధరించారు. సదరు ఉద్యోగి రెండు రోజుల క్రితం కరోనా పరీక్ష చేసుకోగా.. ఉదయం ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఫలితం రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ ఉద్యోగికి విధుల నుంచి ఉపశమనం కల్పించి విశ్రాంతి తీసుకునేలా అక్కడి అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఇవీ చదవండి:

తిరుపతి ఉపఎన్నిక: మధ్యాహ్నం ఒంటి గంట వరకు 36.67 శాతం పోలింగ్

కరోనా మరణాలను ప్రభుత్వాలు దాస్తున్నాయా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.